నీహారికకి స్ట్రాంగ్ బ్యాక్

8 Mar 2016                         ఫిల్మ్ ఇండస్ట్రీలో సపోర్ట్ లేనిదే నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు, అదే హీరోయిన్లేతే చెప్పక్కర్లేదు. ఐతే ఒక్కోసారి ఎంత బ్యాకింగ్ ఉన్నా తెరమరుగు కావాల్సిన సందర్భాలూ ఉన్నాయ్. వాటిలో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల ఎపిసోడే ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇతర హీరోయిన్లను మాత్రం చొంగ కారుస్తూ, రకరకాల కామెంట్లు, డిఫరెంట్ ఫోజుల్లో ఫోటోలు చూస్తారు కానీ తమ హీరోల అమ్మాయిల విషయంలో ఎక్కడలేని జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఈ ఫ్యాన్స్ ఇప్పుడదే సిచ్యుయేషన్ నీహారికకు ఎదురవ్వచ్చంటున్నారు. ఎందుకంటే నీహారిక ఈ తరం అమ్మాయి అందుకే ఎంత మేల్ డామినేషన్ ఉన్నా ముందు షార్ట్ ఫిల్మ్ తర్వాత యాంకరింగ్ తో ఆకట్టుకుంటోంది. ఐతే ఇప్పుడు క్వశ్చెన్ ఒక్కటే, మరిప్పుడు నీహారిక హీరోయిన్ గా ఇప్పుడు ఏ జోనర్ లో నిలబడుతుందన్నదే ప్రశ్న.
                              మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కి ఆమె ఎక్స్ పోజింగ్ నచ్చదు. సమస్యే లేదు కానీ మరి మిగిలిన హీరోయిన్లతో పోల్చుకుంటే వాళ్లకి లేని మినహాయింపులు హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చిన కథానాయికలకు ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది. వాళ్లు ఆడిపాడే హీరోయిన్లకైతే బొడ్డు కిందకి చీర, సగం బ్రెస్ట్ కన్పించేలా జాకెట్లు, లోనెక్ టీ షర్ట్స్ వాడతారు. ఎలా పడితే అలా బూతు డైలాగులతో టీజ్ చేయడం, డాన్సులేయించడం చేస్తుంటారు. అంటే పరువు ప్రతిష్ట వారికేం ఉండవా లేకపోతే డబ్బిస్తే చాలు ఏమైనా చేస్తారని కవర్ చేస్తారా.
                              బ్యాక్ గ్రౌండ్ ఎంత పటిష్టంగా ఉన్నా అటు మంజుల కానీ, నాగార్జున మేనకోడలు సుప్రియ కానీ ఎలా తెరమరుగు అయ్యారో చెప్పాల్సిన పనిలేదు. సో ఇప్పుడు నీహారిక కూడా అలా నిండైన దుస్తులు ధరిస్తూ కొన్ని సినిమాలు చేసి తన కళాతృష్ణ తీర్చుకోవాలేమో. ఐనా ఇలాంటి భేషజాలు తెలుగులోనే అదే హిందీలో చూస్తే, రాజ్ కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కరీనా, కరిష్మా కపూర్  లు. అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ ఇలాంటివేం పట్టించుకోకుండా ఫ్రీగా బికినీల్లో దర్శనమిస్తూ అందరికంటే ముందంజలో ఉన్నారు. ఆ రోజులు తెలుగులో మాత్రం రావు డౌట్ లేదు, ఒక మనసు నిహారిక మొదటి సినిమా అవుతుందట. సినిమా చూస్తే మన డౌట్స్ కి ఓ క్లారిటీ రావచ్చు.
Mega family first heroin Niharika is entering into films. Her first movie first look was released yesterday. But in tollywood different trend is continuing to heroins.