నారాయణ..నారాయణ

3 Mar 2016                                మంత్రి నారాయణ చెప్పే మాటలు వింటే ఎవరికైనా నవ్వు రాక మానదు. అందులో ఇప్పుడు ఆయన డైలాగ్స్ కు సాక్షిటీవీలో బాబూ చిట్టీ క్యాంపైన్ ఇంకా పేలింది. ఎందుకంటే మంత్రి నారాయణకు వేలకోట్ల సంపాదన ఉండేదట దాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఫస్ట్ పాయింట్ విద్యావ్యాపారం అనేది ఉందని ఒప్పుకోవడం సెకండ్ పాయింట్, దాన్ని వదులుకున్నానని చెప్పడం నారాయణ డైరక్టర్ గా ఆయన లేనంత మాత్రాన దాని పై వచ్చే ఆదాయం ఆయనకి కాక వేరేవాళ్లకు పోతుందా. దీన్నే ఏదో నేర్చినమ్మ బొంకునేర్వదా అంటారు. అసలు సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినోళ్లైతే నారాయణ కాలేజ్ యాజమాన్యం పెట్టే హింసలు భరించలేక, ప్రతి రోజూ ఏదోక ప్రాంతంలో విద్యార్ధుల ఆత్మహత్యలు, ధర్నాలు కన్పిస్తూనే ఉఁటాయ్. 

                                    ఐతే ప్రతీ మీడియాకు ప్రకటనల రూపంలో ఆదాయం పంపిస్తూ తమ కాలేజీల నిర్వాకాన్ని బైటికి తెలియకుండా మేనేజ్ చేస్తుంటారు. ఇది ముమ్మూటికీ నిజం విద్యార్ధుల రక్తం పిండి ఫీజులు కట్టించుకునే ఈ కాలేజీల యజమాని పై వియ్యంకుడి రూపంలో పెద్ద అండ దొరకడంతోనే ఎలాంటి కేసులు లేకుండా బయటపడగలుగుతున్నాడంటారు. అలాంటిది ఇప్పుడు రాజధాని సమీపంలో భూములు బొక్కేసి సేవ చేస్తున్నాననడం దౌర్భాగ్యం కాక మరేంటి. బహుశా ప్రజలకు షేవ్ అనబోయి సేవ చేస్తున్నాడన్నాడేమో అని జనం జోకులేస్తున్నారు నారాయణ..నారాయణ.
AP cabinet minister Narayana comments are very funny. He is telling about his business and money issues.