చేపకు ఈత

3 Mar 2016                           తెలుగు నాట డ్యాన్సులంటే గుర్తొచ్చే పేరు చిరంజీవి, స్టెప్పులకు ఆద్యుడని కీర్తిశేషులు ఏఎన్నార్ ను చెప్పుకుంటున్నా, అసలు డ్యాన్సులకు ఊపు ఓ క్రేజ్ తీసుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవే మిగిలినవాళ్లూ తక్ుకవ కాకపోయినా డ్యాన్స్, ఫైట్లనే ఆలంబన ఆధారంగా చేసుకుని ఓ వెలుగు వెలిగిన నటుడు చిరంజీవి. అలాంటి  మెగాస్టార్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే ఎవరైనా తమ ఫీల్డ్ లో టచ్ పోతే తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేటప్పుడు రిహాల్సల్స్ గట్రా చేస్తుంటారు. 

                                      ఇప్పుడు మెగాస్టార్ కూడా అందుకే డ్యాన్సులు సాధన మొదలెట్టాట్ట. గత సంవత్సరం నుంచి తెగ హంగామా చేస్తున్న 150వ సినిమా  ఎప్పుడొస్తుందో తెలీదు కానీ ఇలాంటి న్యూస్ చాలానే బైటికి వచ్చాయ్. లేటెస్ట్ ఖబర్ ఏంటంటే ఫిట్ నెస్ కాపాడుకోవాలంటే డ్యాన్సులను మించిన మీడియా లేదనుకున్న చిరు దాని కోసం జుంబా స్టైల్ డ్యాన్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడట. ఐతే ఇది రెగ్యులర్ ఫిట్ నెస్ కోవడమా లేక నిజంగానే నూటయాభై సినిమా కోసమా అనేది తెలియదు. కానీ చిరంజీవి ఫిట్ నెస్ విషయంలో మాత్రం నాగ్, బాలయ్యలా కాకపోయినా సెపరేట్ జాగ్రత్తలు తీసుకుంటాడనేది నిజం. అందుకే ఇప్పుడు జుంబా అజుంబా అంటున్నాడులా ఉందంటున్నారు.
Total tollywod is waiting for Chiru's 150 th movie. For 150 th movie Mega Star Chiranjeevi practicing dance.