మహేష్ కి తెగనచ్చేసిందట

28 Mar 2016ప్రిన్స్ మహేష్  బాబు ఏం చేసినా దానికో సెపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన చిన్న మాట పాజిటివ్ గా చెప్పినా లక్షలాది మందికి అది చేరిపోతుంది. అలాంటిది ఏకంగా ఓ ఇరవై నిమిషాలు ఓ సినిమా గురించి పొగిడేశారంటే ఇంకేమైనా ఉందా..? రీసెంట్ గా రిలీజైన ఊపిరిని మహేష్ బాబు చూసి 20 నిమిషాల పాటు నాగార్జునతో మాట్లాడేస్తూ ఉన్నాడట. ఇది స్వయంగా నాగార్జుననే చెప్పాడు.

నిజంగా సక్సెస్సైందో లేదో కానీ (ఎందుకంటే రెండు మూడు రోజులకే సక్సెస్ మీట్లు ఓ పదేళ్ల నుంచి అలవాటైపోయాయ్ కదా) సినిమా యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ, ఇండస్ట్రీలో బిగ్ షాట్స్ అంతా ఈ మూవీని మెచ్చుకుంటున్నారని చెప్పారు. కొత్త కథలని మీరే చేస్తుంటే ఇకమేమేం చేయాలని మహేష్ చమత్కిరించినట్లు నాగ్ చెప్పుకొచ్చాడు. ఎలాగైనా మహేష్ బాబు ఫ్రెండ్లీనెస్ కి ఇదో నిదర్శనంగానే చెప్పుకోవాలి. ఇన్ టచబుల్స్ కి రీమేక్ గా తీసిన ఈ సినిమాకి రిపోర్టుల వరకూ అన్నీ పాజిటివ్ గానే వచ్చాయ్.
Nagarjuna latest movie Oopiri is the biggest hit. It is the remake of Tamil movie. All popular persons in industry prised about this film. Mahesh Babu told he like it very much.