హరిద్వారాలో మహేష్ క్రేజ్

30 Mar 2016


తెలుగునటుల్లో మహేష్ బాబుకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారంటే ఓవరాక్షన్ కాదు. ఈ మధ్యనే బ్రహ్మోత్సవం షూటింగ్ కోసమని హరిద్వారాకి వెళ్లినప్పుడు మహేష్ క్రేజ్ అంటే ఏంటో మరోసారి తెలిసి వచ్చింది. విష్ణుఘాట్ దగ్గర మహేష్ బాబు సమంతలపై క్రూషియల్ సీన్లు షూట్ చేస్తుంటే ఫ్యాన్స్ విరగబడి వచ్చారట. మహేష్ బాబు అంటే హరిద్వారాలో పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చని అనుకుంటే, వేలాదిగా తరలివచ్చిన ఫ్యాన్స్ ని చూసేసరికి యూనిట్ కి మైండ్ బ్లాంక్ అయిందట.

అంతమంది జనాన్ని కంట్రోల్ చేయలేక తలపట్టుకున్నాడట డైరక్టర్ శ్రీకాంత్. చివరికి లోకల్ పోలీసులను పిలిపించి వాళ్లందరిని కంట్రోల్ చేసి, అప్పుడు షూటింగ్ చేసుకున్నారుట. ఇది మార్చి 2న హరిద్వారాలో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు శివరాత్రి సంబరం అక్కడ బాగా చేస్తారని డైరక్టర్ అనుకుంటే, అక్కడి రష్ కి తోడు, మహేష్ ఫ్యాన్స్ కూడా కిక్కిరిసిపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదట సినిమా క్రూకి ఎలాగోలా షూటింగ్ ముగించుకుని తాము కూడా గంగలో ఓ మునక వేసారట.
Tollywood hero Mahehs Babu has fans following world wide. Recently Bhramostavam shooting was done in Haridwar, lacks of people were came to see Mahesh shooting.