అమరావతికి లండన్ పెట్టుబడులా..?

12 Mar 2016


                       ఏపి సిఎం చంద్రబాబు ఏం చేసినా భారీ రేంజ్ లో ఉంటుంది, కనీసం ఆస్థాయిలో పబ్లిసిటీ ఉంటుంది. అందుకే ఏ దేశానికి వెళ్లినా ఇప్పుడు లైవ్ కవరేజ్ వచ్చేలా జాగ్రత్త పడతారాయన. ఏపీ బడ్జెట్ పెట్టారో లేదో, వెంటనే లండన్ చెక్కేసిన బాబు అండ్ కో అక్కడ తెగబిజీగా గడుపుతన్నట్లు లీకులిస్తున్నారు. లండన్ స్టాక్ ఎక్సేంజ్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయినట్లు, వాళ్లకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పాటు ఏపీలో ఉన్న ఖాళీ స్థలాలు, అక్కడి వ్యాపారఅవకాశాలపై గంటలకొద్దీ ప్రసంగాలు ఇస్తున్నట్లు ఆ దృశ్యాలు చెప్తున్నాయ్. హాయిగా థేమ్స్ నదిపై విహరిస్తున్న సీన్లు కూడా లైవ్ వచ్చాయంటే, టెక్నాలజీని ఏ రేంజ్ లో వాడుతున్నారో తెలుస్తోంది.

                    ఐతే చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాల్సిన  సంగతి కాలికి బలపం కాకపోతే గునపం  కట్టుకుని తిరగొచ్చు కానీ, అసలు ఏమాత్రం ఇన్వెస్ట్ మెంట్స్ వస్తున్నాయ్. వాటిలో ఏవి ఏదశలో ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనేది ఎప్పటికప్పుడు చెప్తుంటే అప్పుడు ఆయన విదేశీ పర్యటనలపై సందేహాలు ఉండవు. ఎందుకంటే హడావుడిగా దేశాలు తిరిగొచ్చే లోపే 2019  ఎన్నికలు వస్తాయేమో అని డౌట్ వస్తోంది. ఇప్పటికే రకరకాల దేశాలు ప్రధాని మోడీతో పోటీ పడుతున్నట్లు తిరుగుతున్న ఏపీ సిఎం రాష్ట్రానికి రావాల్సిన నిధులెందుకు రాబట్టుకోలేకపోతున్నారో తెలీక జనం జుట్టు పీక్కుంటున్నారు.
Andhra Pradesh CM Chandrababu always planing foreign tours with high budget. Present he is in London. He is not telling how many companies are coming to AP.