పాపం పవన్

19 Mar 2016


                 పాసులున్నోళ్లే నా ఆడియో ఫంక్షన్ కి రండంటూ హీరో కాని హీరో పవన్ కల్యాణ్ పిలుపిచ్చాడు. అసలు ఫంక్షనే లేదనుకున్నాం కానీ, చివరికి పెడుతున్నామని కూడా సన్నాయి నొక్కాడు పవన్. ఎందుకంటే సినిమా ఆడియో ఫంక్షన్ ఏదో జనానికి ఉపాధి హామీ పథకంలా బిల్డప్ ఇవ్వడం. దాన్ని అన్ని ఛానళ్లు లైవ్ ఇవ్వడం చూస్తుంటే హాస్యాస్పదం. పైగా ఈయనగారి ఆడియో ఫంక్షన్లో అసాంఘికశక్తులు చొరబడతాయంటూ బిల్డప్ ఇవ్వడం చూస్తుంటే, ఆయన రేంజ్ గురించి ఏదో ఊహల్లో ఊరేగుతున్నారు. నోవాటెల్ లో పాసులున్నోళ్లకే అనుమతి కొత్తగా చెప్పేదేముంటుంది. ఆ హోటల్ లోకి ఎవడు బడితే వాడేం వెళ్లలేరు అలాగని అతను చెప్పినదాంట్లో ప్రతి మాటకి మరో మాటకి సంబంధం లేకుండా "నాకు ఆడియో ఫంక్షన్ ఇష్టం ఉండదు. మళ్లీ నిజాం గ్రౌండ్స్ లో పెడదామనుకున్నాం". సినిమాకి ఆడియో ముఖ్యం, సందర్భం లేకుండా కేటీఆర్ కి కృతజ్ఞతల"ని చెప్పడంఇలా రకరకాలుగా ఓ రకంగా బాలకృష్ణని తలపించాడనే చెప్పాలి.

         ఓ పార్టీ పెట్టి ఎన్నికల్లో  పోటీ మాత్రం చేయనని చెప్పిన ఘనత మనోడిదే..అలానే ఎప్పుడో తన అవసరం కోసం మాత్రమే బైటికి వచ్చి తన భజన బృందం మధ్యలో ఈలలు వేయించుకుని మళ్లీ మాయం అయిపోయే పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తానని చెప్పాడీ మధ్య, ఈ ప్రెస్ మీట్లోనే ఎవడి పని వాళ్లు చేయాలంటూ జోకులేయడం. ఈయనగారి తీరు చూస్తే తలచుకుంటే ఏదైనా అయిపోగల స్థాయి అని మనోడి మనసులో అనుకుంటుండాని కొంతమంది ప్రెస్ మీట్ అనంతరం వ్యాఖ్యానించడం ఆంధ్రాపల్స్ గమనించింది.
Pavan Kalyan Latest movie Sardhar audio function will commence in Novatel hotel. Passes were distribute to limited members. Pavan saying come only who have passes.