వర్సటాలిటీకి డెఫినిషన్

8 Mar 2016



                              బహుముఖప్రజ్ఞాశాలి అనే పదానికి  అసలైన నిర్వచనం కళాభవన్ మణి. తెలుగు సినిమాల్లో జెమినీతో తెగ నచ్చేసిన మణి అటు కామెడీ, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశారు. కొచ్చిలో లివర్ చెడిపోయి అనారోగ్యంతో చనిపోయారంటున్నారు. 45 ఏళ్ల మణి మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయ్. ఇది ఎవరో కావాలని విషప్రయోగం చేయడమో, లేక మరో విధంగానే ఆయన బలవన్మరణం చెందేలా చేశారని అంటున్నారు. దీంతో చాలక్కుడి పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కూడా విషపూరిత పదార్ధాలు మణి శరీరంలో ఉన్నట్లు తేల్చింది.

                          మామూలుగా కిడ్నీ, లివర్ డామేజైనా వారి బాడీలో కీటోన్ బాడీస్ ఎక్కువగానే ఉంటాయి. అలా విషపదార్ధాలు కన్పించాయా, లేక విషప్రయోగం జరిగిందా అన్నది దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. చిన్న స్థాయి నుంచి సినిమా తెరపై ఎదిగిన మణికి కళాభవన్ అనేది ఇంటి పేరు కాదు, స్టేజ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంటూ. మిమిక్రీ చేస్తూ, అందులో మైమ్, కూడా మిక్స్ చేసి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడాయన. అలా ఆయన పేరు కళాభవన్ మణిగా మారింది. జెమినీ తమిళ సినిమాలో ఆయన విన్యాసాలు అందరినీ ఆకట్టుకోవడంతో, తెలుగు జెమినీలో కూడా నటించారు. తర్వాత ఆయుధం, అర్జున్ తదితర సినిమాల్లో కన్పించారు. నాలుగు భాషల్లో కలిపి వందకి పైగా సినిమాలు చేసిన కళాభవన్ మణి లేని లోటు ఇకపై మళయాళ సినిమారంగానికి స్పష్టంగా కన్పిస్తుంది.
Kalabhavan Mani is the name of Versatile genius. He did movies in Tollywood also, basically he is from Tamil. He debut in Tollywood with Gemini. Romour in Tollywood is he was in poision.