నాది మోడ్రన్ బోల్డ్ టైప్ క్యారెక్టర్

30 Mar 2016


బ్రహ్మోత్సవంలో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ పై సస్పెన్స్ ని తానే స్వయంగా బ్రేక్ చేసింది. ఇందులో మోడ్రన్ గాళ్, అందులోనూ బోల్డ్ టైప్ క్యారెక్టర్ చేస్తుందట. ఇందులో మహేష్ బాబుతో  రెండోసారి చేయడంపై ఆమె పిచ్చ హ్యాపీగా ఫీలౌతుందట. ఫారిన్ రిటర్న్డ్ గాళ్ గా కన్పిస్తానని చెప్తున్న కాజల్ మరి అందుకు తగ్గట్లే క్యాస్ట్యూమ్స్ కూడా ఉంటాయని ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. జీన్స్, స్కర్ట్స్ తో కాజువల్ గా కన్పించే పాత్రలో మహేష్ బాబుతో ఢీ అంటే ఢీ కొట్టే పాత్ర చేస్తుందట. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి తన ఫ్యామిలీని కలవడానికి వస్తుందని కూడా చెప్పింది. తన లక్ష్యం కోసం ఎవరిని లెక్క చేయదటట, ఇప్పుడీమె ఇచ్చిన హింట్ తో స్టోరీ లీకవుతుందని డైరక్టర్ శ్రీకాంత్ మండిపడతాడేమో చూడాలి.

ఎఁదుకంటే ఇదో ఫ్యామిలీ చిత్రం, వేల్యూస్ ని లెక్కచేయని హీరోయిన్, వేల్యూస్ కి విలువ ఇచ్చే హీరో అంటే మిస్టర్ ఫర్ ఫెక్ట్ లో ప్రభాస్ కాజల్ మధ్య సీన్లలాంటివేమైనా ఉంటాయేమో అని అప్పుడే కథలు అల్లేస్తున్నారు కూడా. రెండోసారి మహేష్ బాబుతో చేయడంపై స్పందిస్తూ ప్రిన్స్ చాలా కంఫర్టబుల్ అని కితాబిచ్చేస్తోంది. మరిప్పుడు కాజల్ అగర్వాల్ తన సినిమాలోని క్యారెక్టర్ గురించి రివీల్ చేయడంపై సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tollywood tall heroin Kajal Agarwal is now doing in Sardhaar and Bhramostavam movies. In Bhramostavam she is doing with Mahesh Babu second time. So all fans are eagerly waiting for her character. She reveal her character in Bhramostavam movie.