నన్నే..నన్నే ఏరి కోరి

11 Mar 2016


                           తెలంగాణ సిఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత రాజయ్య ని మంత్రివర్గం లోంచి తీసేశారు. ఆ తర్వాత కొందరిపైనా టార్గెట్ పెట్టారని న్యూస్ వచ్చినా పెద్దగా పట్టించుకోలేదెవరూ. ఐతే ఇప్పుడు బంగారు తెలంగాణ బ్యాచ్ ఒకటి బయల్దేరింది, అది సిగ్గులేకుండా నియోజకవర్గాల అభివృధ్ది కోసమని పార్టీ మారుతున్నట్లు బిల్డప్ ఇవ్వడం ప్రారంభించింది. ఇప్పుడు అన్ని ఎన్నికలూ ముగియడంతో ఇక కేసీఆర్ అసలునైజం చూపిస్తారని అంటున్నారు. అందులోనూ బీటీ బ్యాచ్ హవాతో ఎప్పట్నుంచో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు వళ్లు మండుతుందట. దాంతోపాటు కొత్తగా వచ్చిన మరో బ్యాచ్ కి ఏదోక తాయిలం ఇవ్వకపోతే, మళ్లీ టిడిపిని గోకే ప్రమాదం ఉందని కేసీఆర్ కేబినెట్ లో మార్పులు చేస్తారంటున్నారు. 
                           దీనికి కడియం శ్రీహరి బలౌతాడని ప్రచారం జరుగుతుండగా, మంత్రిగారి స్పందన మాత్రం డిఫరెంట్ గా ఉంది. కేసీఆర్ సారు నన్ను ఏరి కోరి తెచ్చుకున్నారని, ఎవర్నైనా తీస్తారేమో కానీ నన్నెందుకు కదిలిస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారట. అసలు తన రాకతో కేబినెట్ కి ఓ కళ వచ్చిందని కూడా లాబీల్లో మాట్లాడుతున్నారంటే ఆయన అమాయకత్వానికి ఎలా స్పందించాలో మీడియా మిత్రులకు అర్ధం కావడం లేదట.
To attract TDP MLAs KCR giving offers to them. So he is giving ministers to them. So he is taking cabinet form TRS leaders. So Kadiyam Srihari is in race.