కేసీఆర్ నిరుద్యోగులకు షాక్ ఇచ్చినట్లేనా

27 Mar 2016


ముఖ్యమంత్రిగా మారకముందు కేసీఆర్ కి నిరుద్యోగుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉేండేది. ఐతే సిఎంగా పదవి స్వీకరించిన తర్వాత మాత్రం ఓయూలో ఆయనకి వ్యతిరేకంగా ఓ బలమైన గ్రూపు ఏర్పడింది. ముందు చెప్పినట్లు ఉద్యోగ నియామకాలు లేకపోవడం సరి కదా, వాటి ఊసే ఎత్తకుండా మిషన్ భగీరధ, కాకతీయ అంటూ తమని పట్టించుకోవడం లేదని వారిలో ఆగ్రహం పెల్లుబికుతోంది. 

ఇప్పుడు దానికి తగ్గట్లు గ్రూప్ టూ..కానిస్టేబుల్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో  పరీక్షల కోసం ఇప్పటి వరకూ రేయింబవళ్లూ చదివిన వారికి ఇది పెద్ద అశనిపాతంగా మారింది. మరోవైపు ఎస్సై పరీక్షలో ఇంగ్లీషు లాంగ్వేజ్ కి  ఉన్న వెయిటేజీని రద్దు చేసినట్లు తెలిపింది. ఐతే ఎప్పట్నుంచో తాము వెయిట్ చేస్తున్న పరీక్షలు వాయిదా పడటం, మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో తెలీకపోవడంతో నిరుద్యోగులు, చిరుద్యోగుల్లో దిగులు అలముకుందంటున్నారు.
At the time of Telangana state formation, KCR gave promise to give government job notifications. Now still he not giving any notification.