నిలువెత్తు అహంకారం

14 Mar 2016


                              నిలువెత్తు అహంకారానికి నిదర్శనం ఆ రాష్ట్ర సిఎం. ఇందుకు ఆయన అసెంబ్లీలో వ్యవహరించిన తీరే ఉదాహరణగా చెప్పొచ్చు. తన గొప్పదనం, గురించి తానే డప్పు కొట్టుకుంటూ, చనిపోయిన నేతలపై విమర్శలు చేస్తూ సాగిన ఆయనగారి ప్రసంగంపై అటు సొంత రాష్ట్రంలో, ఇటు పొరుగురాష్ట్రంలో విపరీతమైన ఆగ్రహం కలిగిస్తోంది. ఆయన ప్రసంగం ప్రకారం దివంగత మహానేత ఆ రాష్ట్రానికి ఏమీ చేయలేదట, కుట్రతోనే జలయజ్ఞం చేపట్టినట్లు చెప్పారు. అలాంటప్పుడు మరి సిటీలో మణిహారంగా చెప్పుకునే మెట్రో రైల్ ఎందుకు మహానేత మానసపుత్రికగా పట్టాలు ఎక్కించారో కూడా సమాధానం చెప్పాలి. నిండు సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను దబాయిస్తూ, గద్దిస్తూ చేసిన ప్రసంగానికి ఆ రాష్ట్ర స్పీకర్ చేష్టలుడిగి చూస్తుండటం తప్ప వేరే రూలింగ్ లేదు, రూలూ లేదు. 

                      పైగా ఎస్ ముఖ్యమంత్రి గారు నన్ను పర్మిషన్ అడిగారు, ఎస్ ఆయన నాకు చెప్పారు అంటూ ఇష్టంవచ్చినట్లు మద్దతు పలికిన తీరు చూస్తుంటే రేపు ఆయనగారు చేయబోయే ఉమ్మడిసభల ప్రజెంటేషన్ ను కాంగ్రెస్ బాయ్ కాట్ చేస్తుందనే అన్పిస్తోంది. అదే మంచిది కూడా ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రి ఒకాయన కట్టె పట్టుకుని చెప్పిండంటూ తెగ ఎగతాళి చేసే ఈయనా, ఈయనగారి కొడుకూ ఇప్పుడు ఏ కట్టె పట్టుకని ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇస్తారో చూడాలి. ఎంతసేపూ పక్కరాష్ట్రమోడిమీద పడి ఏడవటం తప్ప ఈ ఐదేళ్లలో ఏం చేస్తారో చేయబోతారో చెప్పే దమ్ము లేక సమాధానం చెప్పడానికి బతికిలేని మహానేతలపై విమర్శలు చేయడం ఆడిపోసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. ఈ తీరు మారకపోతే, త్వరలోనే మహారాష్ట్రలో శివసేనలా ఆ రాష్ట్రంలో మరో పార్టీ మారకతప్పదు.
In Telangana assembly Telangana CM KRS comments are very foolish. He talking about Late YSR. If he continued like this, his party will not appear in Telangana