ఇదేనా బంగారు రాష్ట్రం..

31 Mar 2016


దోమలు కుట్టి చనిపోతున్నారు, మిడ్ సమ్మర్ లో స్వైన్ ఫ్లూతో చనిపోతున్నారు, ఆర్టీసీ బస్సులో పక్క బస్సు రాడ్ దూసుకెళ్లి చస్తున్నారు, పురుగుల మందులు తాగి రైతులు చస్తున్నారు, కుటుంబకలహాలతో, చనిపోతున్నారు మరి అధికారులు ఏం చేస్తున్నారు. కౌన్సిలింగ్ సెంటర్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇలా వరసగా మరణాలకు లెక్క లేకుండా పోతుంటే పెద్దలు మాత్రం నిద్ర నటిస్తున్నారు.

తాజాగా ఇప్పుడు వేసవి వడదెబ్బకి 70 మంది చనిపోతున్నా, తాము తమ గొప్పలు తప్ప జనం బాధలు పట్టించుకునే నాధుడు లేరు. వీధికుక్కలదాడిలో కూడా చిన్నారులతో పాటు, పెద్దవాళ్లు కూడా మృత్యువాత పడుతుండటం  రాష్ట్రంలో అరాచకానికి నిదర్శనం అంటే గింజుకోవడం కాదు కానీ గొప్పగా గత ప్రభుత్వాల తప్పిదాలను ఎత్తి చూపుతామంటూ పవర్ ప్రెజెంటేషన్ కోసం తిప్పలే తప్ప నిజంగా వాటిపై ఆసక్తి ఎవరికి ఉంది. లిఫ్ట్ లుపనిచేయని గాంధీ ఆస్పత్రి, మంచి నీళ్లు బెడ్లు కరవైన నిమ్స్ హాస్పటల్, రోగుల ఇక్కట్లు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఈతిబాధల రాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధ్యమయ్యేది ఎప్పుడు ?
Today Telangana CM KCR gave power point presentation in Assembly about Telangana development. But opponent parties are firing about it.