జ్యోతుల నెహ్రూ జంపింగ్ బ్యాక్

28 Mar 2016


గత రెండ్రోజులనుంచి ఏపీ పాలిటిక్స్ లో హడావుడి నెలకొంది, ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారాంటూ వైఎస్సార్సీపీ విప్ కత్తి నూరుతుంటే టిడిపి వారిపై వేటు పడకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్న ఆప్షన్లన్ని వెతుకుతోంది. ఈలోపుగానే పత్తిపాడు ఎమ్మెల్యే సుబ్బారావ్, జ్యోతుల నెహ్రూ కూడా జంపవుతున్నారంటూ ప్రచారం జరిగింది. ఐతే ఇవాళ నెహ్రూ దీనికి కౌంటర్ గా అన్నట్లు తానే పార్టీ మారేదీ లేనిదో తొందర్లో చెప్తానంటూ నీలుగుతున్నారు. ఇది ఏదో తమాషాకి కాదు, మార్చి 29, 30 ఈ రెండ్రోజుల్లో జరగబోయే పరిణామాలను ఊహించే ఇలా లీకులిచ్చినట్లు అర్ధం అవుతోంది. ద్రవ్యవినిమయ బిల్ పై విప్ జారీ చేయడం, అది తీసుకోవడం ఆ తర్వాత అనర్హత అంశం ఇలా అనవసర రగడ ఎందుకు ఇప్పటికి ఇప్పుడు సైలెంట్ గా ఉంటే మేలు తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే తెలివైన ఎత్తుగడతోనే జ్యోతుల నెహ్రూ వెనక్కి తగ్గారంటున్నారు. 

ఐతే ఈ సందర్భంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కాస్త వినోదాన్ని పంచుతున్నాయ్. ఎందుకంటే పదవులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయట. పదవుల కోసం నెహ్రూ వెతుక్కుంటూ పోడని చెప్పుకున్నాడాయన. మరైతే ఇప్పుడు టిడిపిలోకి ఏం బావుకునేందుకు వెళ్తాడో కూడా చెప్పాలి మరి. ఇప్పుడు కీలక సమయంలో పార్టీ నుంచి జంపైతే, విప్ తీసుకున్నందుకు అనర్హత వేటు పడుతుందనే వెనక్కి తగ్గినట్లు క్లియర్ గా అర్ధమవుతోంది. ఐతే ఇదంతా జగన్ కి తెలీదా, అందుకే రేపు అసెంబ్లీలో  జగన్ నెహ్రూకి ఎలాంటి ఝలక్ ఇవ్వబోతున్నాడో చూడాలి..!
TDP is attracting all MLAs from YSRCP by giving offers to them. Recently Jyothula Nehru is trying to jump into TDP. But he not giving any comments on it.