జేసీ కామెంట్స్

27 Mar 2016ఎప్పటికప్పుడు ఏదోక కామెంట్ చేయడం జనం నోళ్లలో నానడం అనే పద్దతి అనంతపురం ఎఁపి టిడిపి నేత జేసీకి తెలిసినట్లు ఎవరికీ తెలీదు. అవడానికి ఎంపి అయినా ఈ మధ్య అసెంబ్లీ లాబీల్లోనే కన్పిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి టిడిపి ఎమ్మెల్యేలపై చంద్రబాబుకి పట్టుపోయిందన్నారు. 

టిడిపి ఎమ్మెల్యేల్లో బాగా నిర్లక్ష్యం పెరిగిందని, చంద్రబాబు ఈ అంశంపై దృష్టి పెట్టాలంటూ వ్యాఖ్యానించారు జేసీ దివాకర్. ఇదిలానే కొనసాగితే కొంప మునిగే ప్రమాదం ఉందంటారాయన, ఐతే జేసీ ఇప్పుడు ఇలా మాట్లాడటం జనరలైజ్ చేసా, లేక నిత్యం  ఏదోటి మాట్లాడుతూ లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నమా అన్నది తేలాలి. ఎందుకంటే గతంలోనే జేసీ తనకి చంద్రబాబు చచ్చినా మంత్రి పదవి ఇవ్వడంటూ కుండ బద్దలు కొట్టారు కూడా.
TDP JC Divakar Reddy is always hot topic in media. Now he comment on TDP MLAa and about TDP party.