నిజమైన ఆంధ్రాపల్స్

17 Mar 2016

                        

                          ఆంధ్రాపల్స్ నిన్న చెప్పినట్లుగానే ఇవాళ తీర్పు వచ్చింది. ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ పై స్టే ఇస్తూ కోర్టు తీర్పుఇచ్చింది. ఈ కేసులో ఫరదర్ ఎంక్వైరీ అవసరమని, ప్రస్తుతానికి రోజా అసెంబ్లీకి వెళ్లొచ్చంటూ తీర్పు ఇచ్చేసింది. దీంతో అధికారపక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ టిడిపి ఆరోపించడం, మంత్రి సస్పెన్షన్ కి ప్రతిపాదించడం, స్పీకర్ కోడెల దాన్ని ఆమోదిస్తూ ఏడాది పాటు సస్పెన్షన్ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయ్. 

                          నిబంధనల ప్రకారం కేవలం ఓ సెషన్ పాటే అలా సస్పెండ్ చేయడం కుదురుతుందని ఏకంగా ఏడాదిపాటు ఎలా సస్పెండ్ చేస్తారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ సహా, ఆ పార్టీ ప్రతినిధులు మొత్తుకున్నా వినే నాధుడు లేకుండాపోయాడు. పైగా "నువ్ పాలిటిక్స్ కి కొత్త నీకేం తెలీదు, మీ నేతకి ఏం తెలీదు చెప్తే వినే రకం కాదు" లాంటి రకరకాల డైలాగులు  వాడిన యనమల, అచ్చెనాయుడు తదితరులంతా ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఎలా స్పందిస్తారో మరి. అన్నీ మాకే తెలుసనుకునే అహంకార ధోరణి ఇకనైనా వీడతారని ఆశిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రోజా ఈ అంశంలో పోరాడిన తీరు మాత్రం అభినందనీయం. ఇక్కడ హైకోర్టు విచారణకే స్పీకరించకపోతే, తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లడం అక్కడా విజయం సాధించి. ఇక్కడకు రావడం ఇలాంటి కేసులకు ఓ స్టడీ కేస్ లా నిలుస్తుందేమో చూడాలి. అలానే పార్టీ ఫిరాయింపులపై కూడా ఇదే మార్గం అనుసరిస్తారేమో అని జంప్ జిలానీల్లో భయం మొదలైంది.
Today AP high court gave judgement on YSRCP MLAs Roja. It is suspension on Roja is removed. Andhrapulse already told about it.