ఇదో రకం తపన

9 Mar 2016                        ప్రతీ నటుడికి గుర్తింపు కావాలని ఉంటుంది. ముందు డబ్బులొచ్చే క్యారెక్టర్లు చేసినా, తర్వాత తర్వాత తమకంటూ ఓ ఇమేజ్, జనంలో గుర్తింపు రావాలని కోరుకుంటారు. అది కూడా వచ్చిన తర్వాత టైమ్ కి తగ్గట్లుగా మారకపోతే వెనుకబడిపోతారు. ఇక అప్పుడు బిగినవుద్ది మనోళ్లలో అసలు తపన, ఇంకా ఘాటుగా చెప్పాలంటే జిల అవార్డులు కాదు రివార్డులు కావాలంటారు. అవార్డులు వస్తే చాలా గొప్పగా ఫీలవుతుంటారు. కానీ వేషాలు తగ్గిపోతే మాత్రం ఎక్కడలేని ఆవేదన దిగులు ఆవరిస్తుంది ఒకప్పుడు గొప్పగా వెలిగిన నటులకు ఇలాంటి వారికి చాలామంది ఉదాహరణలుగా చెప్పవచ్చు. రీసెంట్ గా ఒకప్పటి హీరో ఇప్పటి నటుడు నరేష్ కి ఓ డాక్టరేట్ వచ్చింది. అది కూడా న్యూయార్క్ కి చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అట అసలు ఇదెక్కడుందో ఎవరికి ఎందుకు ఇస్తుందో తెలీదు, పైగా ఇదేదైనా పైరవీ వ్యవహారం అనుకుంటారని ముందే డౌట్ వచ్చినట్లుంది మనహీరోగారికి. వెంటనే ఇది సౌత్ లో తనతోపాటు  కర్నాటక రాష్ట్రవాసి  అయిన మరో భరతనాట్య కళాకారునికి ఇచ్చినట్లు ప్రకటించేశాడు, చాలా ఆనందంగా ఉందన్నాడు. 

                            నిజంగా కామెడీ కాకపోతే ఏంటి నరేష్ చేసిన హిట్ సినిమాలకు కొదవలేదు, అలానే నటన విషయంలో కూడా మంచి మార్కులే పడతాయ్. ఐతే అన్ని రోజులూ ఊరుకుని ఇప్పుడు ఈ పీహెచ్డీ ఎలా వస్తుంది. ఇదెవరికైనా ఇస్తారా అని డౌట్ రాకమానదు. అందుకే అన్నాం తపన ఎక్కువ అయ్యేది వేషాలు తగ్గినప్పుడే అని ఇలా తపనకి సంబంధం లేకుండా ఎలాంటి డాక్టరేట్లు లేని నటులు ఎంతమంది లేరు. సత్యనారాయణ ఇప్పటికీ కొన్ని ప్రవేట్ ఫంక్షన్లకు వస్తుంటారు, ఆయనకే డాక్టరేట్ ఇవ్వలేదు. చంద్రమోహన్ ఉన్నాడు, ప్రభ ఉంది, రాజసులోచన, జయప్రద, జయసుధ ఇలా లిస్టు చాలా ఉంది. ఐనా ఇలా డాక్టర్ అన్పించుకోవాలన్న దుగ్ధ కానీ. నిజంగా మన పేర్లు ఎక్కడో ఉన్న న్యూయార్క్ కి ఎలా తెలుస్తాయ్. గతంలో ఇలాంటి డాక్టరేట్లే శ్రీహరికి మోహన్ బాబుకి కూడా వచ్చాయ్ ఏంటో పాపం వీళ్ల తపన.
Old heroes present has no offers present. But still they are trying for popularity. In the same way hero and Naresh is trying for popularity.