ఒరేయ్ ఫ్రెండు

12 Mar 2016


                                    ఒకప్పుడు చిన్న చిన్న సిల్లీ క్యారెక్టర్లు చేసిన గణేష్ అనే కమెడియన్ ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ షాట్ గా ఎలా మారాడో ఇప్పటికీ ఎవరికీ తెలీని మిస్టరీ. బినామీ అని ఒకరంటారు, కాదు మాఫియా సొమ్మని  ఒకరంటారు. ఏదెలా ఉన్నా మనోడు మాత్రం ఇప్పుడు పెద్ద బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాత. అలాంటోడిపై సచిన్ జోషి అనే ఓ హీరో ట్విట్టర్లో వార్నింగులిచ్చాడు. అది కూడా గణేష్ పుట్టినరోజు సందర్భంగా ఒరేయ్ డియర్ ఫ్రాడ్, నిన్ను నేను తొందర్లోనే జైల్లో చూస్తా నీ సినిమాలు ఏవీ రిలీజ్ కానివ్వను అనేది ఆ ట్వీట్ల సారాంశం.

                             ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే సచిన్ మౌనమేలనోయి, ఒరేయ్ పండు లాంటి సినిమాల్లో నటించాడు. పెద్ద బిజినెస్ మేన్ కొడుకు అతన్ని తెలుగు ఫీల్డ్ లో నాగార్జున తర్వాత అంతటోడివి నువ్వేనంటూ మోసేసి ఫుల్ గా డబ్బులు తినేశారంటారు. ఇప్పుడు కట్ చేస్తే అతనికున్న డబ్బు బలంతో సచిన్ హిందీలో సినిమాలు తీస్తున్నాడు. ఆషిఖీ-2 ను తెలుగులో ఈ బండ్ల గణేషే రీమేక్ చేశాడంటారు. ఆతర్వతా గణేష్ సినిమాలకు ఫైనాన్స్ ఛేసాట్ట. బహుశా ఆ సమయంలో ఏవో ఆర్ధికపరమైన కారణాలతో ఇద్దరికీ పడుతుండటం లేదు దానికి పరాకాష్టే ఈ ట్వీట్లగోల అని చెప్పొచ్చు. ఏదేమైనా సచిన్ ట్వీట్ కి మనోడి దగ్గర్నుంచి రిప్లై లేదు.
Artiest and producer Bandla Ganesh birthday celebrations was celebrated recently. On his birthday hero Sachin fired on Ganesh very hotly.