సుశీలమ్మ ది గ్రేట్

31 Mar 2016


కోకిలగానమంటే మనకి సుశీల పాటే గుర్తొస్తుంది. దాదాపు 60 ఏళ్ల నుంచి ఆ గానం వింటున్నాం మనం, ఇప్పుడామె గొంతుకకి గిన్నీస్ గుర్తింపు లభించింది. ఆరు భాషలు కలిపి  17,695 పాటలు పాడినందుకు  గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ ఆమెకి స్థానం కల్పించింది. తనకి ఉన్న  గానకోకిల బిరుదును సార్ధకం చేసుకుని యావత్ భారతీయ సినీ సంగీత ప్రియులను తన పాటలతో ఆనందడోలికల్లో ఓలలాడించిన పి.సుశీలకి ఈ అవార్డు దక్కడంపై అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

1960 లో ఆలిండియా రేడియోలో గాయనిగా కెరీర్‌ ప్రారంభించిన సుశీల ‘పెట్రతాయ్‌’ అనే తమిళ చిత్రంతో సినీ నేపథ్య గాయనిగా మారారు. ఆరు దశాబ్దాల ఆమె సినీ సంగీత ప్రస్థానంలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగా భాషల్లో రికార్డు సంఖ్యలో పాటలు పాడారు. 2008 లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌  ప్రకటించింది. సుశీల అభిమాని, ప్రైవేటు ఆల్బమ్స్ తయారు చేసే  శ్రీరామ్‌ అనే వ్యక్తి  తన అభిమాన గాయని పాటలను సేకరించి, గిన్నిస్‌ రికార్డు సాధించడంలో సాయపడ్డారు.

సుశీల కెరీర్‌లో రికార్డులకు కొదవే లేదు  ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయని ఆమె. సుశీల ఇప్పటి వరకు ఐదు జాతీయ పురస్కారాలను దక్కించుకున్నారు. మన తెలుగు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి సుశీల 1,336 డ్యూయెట్లను పాడారు. అత్యధిక డ్యూయెట్లు పాడిన గాయనీగాయకులుగా కూడా వీరిద్దరూ రికార్డులకెక్కారు.
Singer Padma Vibhusan P.Suseela got genius record for sung 17,695 songs in six languages. She started her carrier in 1960. She got another record for sang maximum number of duets with S.P.Balasubramanyam.