బిగ్ బి ది గ్రేట్

30 Mar 2016


73ఏళ్ల వయస్సు, నిలువెత్తు మనిషి, అశేష భారతావని అభిమానించే అమితాబ్ ఇప్పుడు మరోసారి జాతీయ అవార్డు గెలుచుకోవడం ఆయన తీరని నటనాదాహానికి నిదర్శనమనే చెప్పాలి. మనకి తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇప్పుడు చిరంజీవి ఉన్నారు.  కానీ ఆయనలా తన వర్సటాలిటీని ప్రూవ్ చేసుకున్నవారు కాదు. ఇది ఎవరికి కోపం వచ్చినా నిజమదే. కృష్ణ , చిరంజీవి కూడా అమితాబ్ లాంటి క్యారెక్టర్లు చేయాలని ఉందంటూ పలు సందర్భాల్లో తమ కోరిక చెప్పారు. ఇప్పుడు పీకు సినిమాలో నేషనల్ అవార్డ్ తెచ్చుకున్న అమితాబ్ కెరీర్ మూడు దశలుగా సాగింది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత డాన్, షెపెన్షా, ఖుద్దార్, దీవార్, షోలే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్లు. అలా పాతికేళ్లు సాగిన తర్వాత మొదటి బ్రేక్ వచ్చింది, అలా ఫ్లాప్ లు రావడం మొదలైన తర్వాత ఖుదాగవా  ఒకటి పేరుతెచ్చింది. 

ఆజ్ కా ఆర్జున్ అనే (తెలుగులో ముద్దుల మావయ్య) సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ పట్టి హమ్ తో మళ్లీ నంబర్ వన్ అన్పించుకున్నాడు అమితాబ్. ఆ తర్వాత మళ్లీ పాతికేళ్ల వరకూ హీరోగా, మెయిన్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ కొనసాగిస్తూనే మరోవైపు కౌన్ బనేగా కరోడ్ పతితో కోట్లాదిమందికి చేరువయ్యాడాయన. కెరీర్లో అగ్నిపథ్, బ్లాక్, పా, పీకూ ఈ నాలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు దక్కించుకున్న అమితాబ్ లోని కోణాలను వెలికితీయడానికి దర్శకులు ఇష్టపడటమే ఆయన లాంగ్విటీకి కారణమనక తప్పదు. మరి మన తెలుగులోనూ ఉన్నారు దర్శకులు, ఇలాంటి క్యారెక్టర్లు వయస్సు మళ్లిన హీరోలకు ఇవ్వగలరా ఛాలెంజ్..
Recenlty Central Government announced National Awards. In this again fourth time Amithab Bachan got nationla awards. Really he is the genius.