భూమా ఎంట్రీ ...టిడిపిలో ఫైర్

30 Mar 2016


అనుకున్నట్లే..ముందే ఆంధ్రాపల్స్ చెప్పినట్లే జరుగుతోంది. భూమానాగిరెడ్డి టిడిపిలో చేరిక సమయంలోనే ఇది ఆ పార్టీలో అసంతృప్తికి దారి తీస్తుందన్నట్లుగానే జరుగుతోంది, పైగా ఇది శృతి మించి దాడులకు పాల్పడటమే పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. భూమా ఎంట్రీ ఇచ్చి నెల తిరక్క ముందే ఇంత త్వరగా దాడులు  జరగడం ఆశ్చర్యం కలిగించకమానదు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అనుచరుడని అంటున్న లాయర్ తులసిరెడ్డిపై గత రాత్రి జరిగిన దాడిలో ప్రాణాపాయ స్థితిలో ట్రీట్ మెంట్ తీస్కుంటున్నాడు. ఇతన్ని పరామర్శించిన అనంతరం శిల్పా మోహన్ రెడ్డి ఇదే విషయం కుండబద్దలు కొట్టాడు.

పార్టీలోకి భూమాని తీసుకుంటున్నప్పుడే చంద్రబాబుతో ఆయనతో కలిసి పని చేయడం కష్టమని చెప్పామని, ఇప్పుడీ దాడికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించాడు. ఫ్యాక్షన్ పంజాగా కొట్టిపారేసేబదులు, అసలు పార్టీలోకి ఇతర పార్టీనేతలను తీసుకువచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో ఆలోచిస్తే ఎలాంటి ఇబ్బందులు  ఉండవని పరిశీలకులు చెప్తున్నారు. ఐతే ఇదేం పట్టించుకోకుండా పై స్థాయిలో నేతలు తీసుకునే నిర్ణయాలకు ఇలా కిందిస్థాయి కార్యకర్తలు బలవడమే రాజకీయవైచిత్రి విధానం.
Recently YSRCP MLA Bhuma Nagireddy entered into TDP. At that Andhrapulse told that some disturbance in starts in TDP. Now it is happening.