ధూళి పడుతోంది జాగ్రత్త

10 Mar 2016


                               ఏపి టిడిపి విప్ ధూళ్లిపాళ్ల నరేంద్ర ఇవాళ అసెంబ్లీలో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి తన కుటుంబంపై రాతలు రాస్తుందన్నారు, ఓవేళ నిజంగా వాటిలో నిజం లేకపోతే తప్పకుండా నోటీసులెందుకు డైరక్ట్ గా సివిల్ డిఫమేషన్ సూటే దాఖలు చేయవచ్చు. దాన్ని వదిలి వేసి మీకూ పిల్లలున్నారు, వారిపై రాస్తే మీకెలా ఉంటుందంటూ సెంటిమెంట్ పూసే ట్రయలేశారు. ఐతే ఇక్కడో సంగతి జగన్ కుటుంబంపై ఎలాంటి ప్రచారం సోషల్ మీడియా పత్రికల్లో ఎలాంటి రాతలు రాశారో గుర్తుకు లేదనుకుంటా.

                             ఆ సంగతి పక్కనబెడితే తాను భూమి కొన్నాడో కొనలేదో చెప్పకుండా, అన్నిపార్టీల నేతలు కొనుగోళ్లు చేశారని. ఎవరైనా కొనవచ్చు అమ్మొచ్చంటూ కవర్ చేసాడాయన. నిజంగా స్థలం కొన్నానని చెప్పకుండా నాకున్న కెపాసిటీతో మూడు ఎకరాలు కూడా కొనలేనా అంటూ సన్నాయి రాగాలు ఆలపించాడాయన. పైగా రాజధాని ఎక్కడొస్తుందో అందరికీ తెలుసని దానికి సాక్షి పత్రిక కథనమే సాక్ష్యమన్నారు ధూళిపాళ్ల. ఐతే ఇక్కడ వాళ్లకే ముందు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ముందు వాళ్లు మాత్రమే ఎలా కొనగలిగారు, అంత తక్కువ రేటుకు ఎలా కొంటారని, అంతే కానీ ఎవరూ కొనలేరని కాదు. అసలు పాయింట్ వదిలేసి ఏదో గొప్ప పని చేసినట్లు నన్ను చూడండి నా కెపాస్టీ చూడండి నేను కొన్నది చాలా తక్కువంటూ బిల్డప్ ఇవ్వడమేంటి ధూళ్లిపాళ్లా.? ధూళి రివర్స్ లో పడుతోంది చూస్కో..!
AP TDP chieg vip Dhulipala Narendra is talking too much is Assembly. He is talking Sakshi is writing too much about my family. And i dont have lands in Amaravathi.