దాసరి సెటైర్ ఎవరిపై

12 Mar 2016                                స్టూడియో భూములు వ్యాపారం కోసం వాడుకున్నారంటూ దర్శకుడు దాసరి చేసిన కామెంట్ ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇదెవరిని ఉద్దేశించి చేశాడాయన ఎవరిపై ఈ సెటైర్ అని ఇండస్ట్రీలో డిస్కషన్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో సినిమాలు తీయడం మానేసిన ఒకప్పటి పెద్దోళ్లంతా తమ అనుభవాన్ని బట్టి ఏదోక కామెంట్ చేయడమో, లేక పుస్తకాలు రాసుకోవడమో చేస్తున్నారు. ఐతే దర్శకనిర్మాత, నటుడు దాసరి నారాయణరావు మాత్రం అటు మెగాస్టార్ వర్గాన్ని, ఇటు అక్కినేని ఫ్యామిలీకి అప్పుడప్పుడూ చురకలేస్తూ హీట్ పుట్టిస్తుంటాడు. సిటీలో సారధీ స్టూడియో రినోవేషన్ తర్వాత మళ్లీ రీ ఓపెన్ అయింది. 

                                   ఆ కార్యక్రమంలో పాల్గొన్న దాసరి " స్టూడియోల కోసం ప్రభుత్వం స్థలం ఇస్తే, దాంతోపాటే ఆ  భూములను కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మార్చారు " అని కామెంట్ చేశాడు. "60 ఏళ్ల క్రితం ప్రారంభించి, సిటీ నడిబొడ్డున అతి విలువైన స్థలం నుంచి ఎటువంటి లాభాల్ని ఆశించకుండా. కేవలం సినిమా పరిశ్రమపై ఉన్న అభిమానంతో ‘సారథి’ స్టూడియోను పునరంకితం చేయడం గొప్ప విషయం. దీనికి  స్టూడియో  చైర్మన్ ఎం.ఎస్‌.ఆర్‌.వి.ప్రసాద్‌ని అభినందిస్తున్నా" అని దాసరి కొనియాడారు. ఇప్పుడు దాసరి చెప్తున్నట్లుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే అక్కినేని వారికి ఉన్నాయ్, అలానే నందమూరి ఫ్యామిలీకి కూడా ఈ విమర్శ వర్తిస్తుంది. అందుకే దాసరి మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారనే చర్చ ఉంది. ఐతే ఆయన చెప్పినట్లుగా సారధీ స్టూడియో నిజంగా అప్పటి పాత చిత్రరాజాలకు ప్రాణం  పోసి, ఇప్పుడు మెట్రో స్టేషన్ దుమ్ముకు పాతబడిపోయింది. ఐతే నిజంగా మళ్లీ జీవం పోసుకోవడం అభినందనీయమే.
In an inauguration of Saradhi Studio, Dasari Naraya comments created heat in cinema industry. He commented about film city industry lands. Its applicable to ANR family and NTR family.