ఏమి సేతురా లింగా..కోర్టు కు రా

10 Mar 2016


                              ఎక్కడైనా హిట్ మూవీస్ కథలు మావేనంటూ కోర్టులకెక్కుతారు. కానీ ఇప్పుడు తమిళనాడులో మాత్రం అట్టర్ ఫ్లాపైనా వదిలేలా లేరు. లింగా సినిమా కథ కాపీ కొట్టారు, అసలు కథ నాదేనంటూ రవిరత్నం అనే అనామకుడు కోర్టుకెక్కాడు. దీంతో కోర్టు నోటీసులు ఇవ్వడంతో రజనీకాంత్ దర్శకుడు కెఎస్ రవికుమార్ బోనెక్కాల్సి వచ్చేట్లుంది. ‘లింగా’ చిత్రం కథ తనదనీ, తాను ‘ముల్లైవనం 999’ పేరుతో ఆ కథను సిద్ధం చేసుకోగా, దానిని కాపీ కొట్టి ఈ చిత్రాన్ని రూపొందించారని మదురై చిన్నసొక్కికుళం ఊరికి చెందిన రవిరత్నం మధురై కోర్టులో కేసు వేశాడు. 

                          గతంలో రజనీ కాంత్ రోబో కూడా మన తెలుగు రచయిత మైనంపాటి భాస్కర్ నవల కాపీ కొట్టారని కేసులు నమోదయ్యాయ్. అలానే ఐ సినిమా కథ కూడా సేమ్ సిచ్యుయేషన్ ఫేస్ చేసింది. రీసెంట్ గా శ్రీమంతుడు స్టోరీ కూడా అందరికీ తెలిసిందే. చూడబోతుంటే ఇది కాపీ కథల సీజన్ లా అన్పిస్తోంది. నిజంగా కాపీ కొట్టారో లేదో కానీ, సినిమాలకు ప్రీ పబ్లిసిటీ వస్తోంది. ఐతే ఫ్లాప్ కథలు కూడా తమవేననడం కొంత సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ .
In movie industry hit movies always faces problems. Now Tamil super star Rajani Kanth movie got flap, but it also faces court problem.