బాబుదంతా మోసమట

3 Mar 2016                           ఏపి సిఎం చంద్రబాబునాయుడు గత 20ఏళ్ల నుంచి మోసం చేస్తూనే ఉన్నారని ఆయన ఒకప్పటి మిత్రుడు మందకృష్ణ విమర్శించారు. విభజన జరిగిన తర్వాత తెలంగాణకు పరిమితం కావాలని తనకు సూచించడం తగదని కూడా ఆయన పైరవుతున్నాడు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మందకృష్ణకి ఆ వర్గంలో మంచి పేరు ఉంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో వివిధ పార్టీల నేతలతో ఆయనకు విబేధాలు, సాన్నిహిత్యం ఓ భాగంగా మారిపోయాయ్. ఐతే ఇప్పుడు వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని ఆరోపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబునాయుడు ఆయన సహచర మంత్రులు, అటు ముద్రగడ పద్మనాభం ఇటు మందకృష్ణ మాదిగ ఇద్దరూ ఒకే డేట్ ను గవర్నమెంట్ కి ఫిక్స్ చేయడంపై కుట్ర కోణాన్ని వెలికితీశారు. గొప్ప డిటెక్టివ్స్ లా దీని వెనుక వైఎస్ జగన్ హస్తముందంటూ ఆరోపించారు. 

                                దీంతో మందకృష్ణకి ఎక్కడో కాలినట్లై టాఠ్ నువ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ నేను రోడ్డుపై ఉద్యమాలు చేశా, అప్పుడు నువ్ నా వెనుకున్నావా అంటూ డైరక్ట్ అటాక్ మొదలుపెట్టాడు. దీంతో చంద్రబాబు అండ్ కో కి షాక్ తగిలినట్లైంది, మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు కూడా ప్రతీ దానికి జగన్ కి ముడిపెడితే మూడేది మీకేనంటూ వార్నింగిచ్చారు. అసలే భూంఫట్ యవ్వారంలో మంత్రుల పాత్ర బైటపడి లాక్కోలేక పీక్కోలేక పోతున్న తెలుగుదేశం నేతలకు మందకృష్ణ వార్నింగ్ తో దడ మొదలైందిట, ఎందుకంటే మందకృష్ణకి సొంతంగా గెలిచే సత్తాలేకపోయినా ఆయన వర్గంలో చాలామంది ఇప్పటికీ మందకృష్ణకి మద్దతు పలుకుతుంటారు. ఎస్సీ వర్గీకరణ రైటో రాంగో చెప్పలేకపోయినా ఆ రెండు వర్గాల మధ్య క్లియర్ పోలారైజేషన్ వచ్చేసింది. అందుకే మాదిగవర్గంలోని ప్రముఖ నేత పార్టీపై కన్నెర్ర చేయడం ఎప్పటికైనా పార్టీ కొంప ముంచుతుందని టిడిపి వర్గాలు అంచనాలు వేస్తున్నాయ్.
TDP national leader Chandra Babu friend Manda Krishna fired on Chandrababu. Manda Krishan has good popularity in his own community.