నిద్ర నటిస్తే ఎలా

10 Mar 2016


                             నిద్రపోయేవాడిని ఎలాగైనా లేపొచ్చు, కావాలని నిద్ర నటించేవారిని ఎలా లేపగలరు. ఇదే జరిగింది ఏపీ అసెంబ్లీలో..! రాజధాని ప్రాంతంలో మంత్రుల దందా అంటూ వచ్చిన వార్తలపై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు అసెంబ్లీలో వింతగా ఉంది, సర్వే నంబర్లు కావాలంటారు, ఆధారాలు చూపించమంటారు, అసలు బినామీ ఎవరంటారు, పేపర్లో వచ్చిన వార్తలను ఆధారం కాదంటారు, నిరూపిస్తే డిస్మిస్ చేస్తామంటారు. నిజానికి మంత్రులు ఎమ్మెల్యేల దందాపై అవాస్తవాలు రాస్తే పత్రికపై చర్య తీసుకోవచ్చు. కానీ సభలో జగన్ అడిగింది దర్యాప్తు, నిజంగా తప్పు లేకపోతే దర్యాప్తు కి ఎందుకు వెనుకాడతారనేది ప్రశ్న, సరే అనవసరపు ఖర్చు అనుకుందాం. కానీ సాటి ఎమ్మెల్యేలు పయ్యావుల, ధూళ్లిపాళ్ల స్వయంగా అవును అక్కడ భూములు కొన్నామని డైరక్ట్ గానే చెప్తుంటే ఎవరూ భూములు కొనలేదని చెప్పడం ఏంటో ఆ లాజిక్ ఏంటో ఏమైనా అర్ధం ఉందా. 

                                వైఎస్ జగన్" నాపై కేసులు పెట్టారు, ఐనా భయం లేదు, సిబిఐ దర్యాప్తు చేయించండి, ఇద్దరూ కలిసే కదా కేసులు పెట్టారు ఇప్పుడు మీపై కూడా ఎంక్వైరీ చేయించుకోండి అంటే ఎందుకు సమాధానం చెప్పరో ఆర్ధం కాదు. ముందు మంత్రులపై సాక్ష్యాలు చూపకపోతే సభ ముందుకు నడవదన్న చంద్రబాబు ఆ తర్వాత ఎందుకు వెనక్కి తగ్గారో తెలీదు, పైగా వైసీపీ సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేయడమేంటో అర్ధం లేదు. ఆరోపణలు చేస్తే, చేసినవాళ్లే రుజువు చేయాల్సి వస్తే మరి జగన్ పై కేసులు పెట్టినవాళ్లు దాన్నెందుకు ప్రూవ్ చేయరు. ఇది జనరల్ క్వశ్చెన్.
In AP assembly TDP leader Chandrababu Naidu is acting like a sleeping person.He is not talking about Land mafia in Amaravathi.