సిగ్గు..రోషం ఉంటే..!

19 Mar 2016


               అసలు అభివృధ్ది పేరుతో పక్క పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటున్న సిఎం చంద్రబాబుకు నిజంగా  సిగ్గు, లజ్జ, రోషం ఏమాత్రం ఉన్నా వారి చేత రాజీనామాలు చేయించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ఇవాళ అసెంబ్లీ దగ్గర బైఠాయించిన అనంతరం అంబేద్కర విగ్రహానికి పాలాభిషేకం చేశారాయన. అసలు తమ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షనే అన్యాయమని కోర్టు తీర్పిచ్చిందని చెప్పిన జగన్, రెండ్రోజులుగా సభకి రోజాని రానీయకుండా టిడిపి ఆడుతున్న నాటకంపై మండిపడ్డారు. ఐతే జగన్ చెప్తున్నదానిలో హండ్రడ్ పర్సంట్ నిజముందనే అంగీకరించాలి. ఎందుకంటే కోర్టు తీర్పిచ్చిన తర్వాత డివిజిన్ కి అప్పీల్ చేయకుండా సభలో చర్చిస్తామనడనం ఖచ్చితంగా కక్షసాధింపే. ఎందుకంటే అసెంబ్లీలో మెజార్టీ ఉన్నంతమాత్రాన అది సభ మొత్తం నిర్ణయం ఎలా అవుతుంది. 

           టెక్నికల్ గా కరెక్టేమో కానీ 68 మంది ఎమ్మెల్యేలు కాదన్న సస్పెన్షన్ సభ  అభిప్రాయం కింద చూపడం దారుణం, అంటే ఇక సభలో టిడిపి ఏం చెప్తే, అది జరిగిపోవాలా. ఇదే ప్రశ్న వైఎస్ జగన్, రోజా సహా వైసీపీ నేతలు అడుగుతున్నారు. జనం కూడా అడుగుతున్నారు. ఈ ఊపులో మళ్లీ సుప్రీంకోర్టో, హైకోర్టో చీవాట్లు పెడితే తప్ప స్పందించరేమో అనుకుంటున్నారు జనం. అందుకే జగన్ కూడా ఇక సభతో మాకు సంబంధం లేదు. మీ ఇష్టం వచ్చిన తీరుతో నిర్ణయం తీసుకోండి. మేం న్యాయపోరాటం చేస్తామని వైఎస్ జగన్ తేల్చేశారు. దీంతో అసెంబ్లీలో 58మంది ఎమ్మెల్యేలతోనే సభ నడుస్తోంది.
AP CM Chandrababu Naidu attracting YSRCP MLAs in the name of development. MLAs who are not attracted by them will be suspended.