ట్యాబ్ ల కథేంటి

17 Mar 2016


                     బడ్జెట్ లోటు, ఆర్ధిక లోటు అన్నీ ఏపికి  లోటే ఈ మాట ఏపి సిఎం చంద్రబాబు ప్రతీ చోటూ చెప్తుంటారు. రాష్ట్రం దిగాలుపడి ఉంటే విమర్శలు చేయొద్దంటూ వేడుకుంటారు, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వమని మండిపడుతుంటారు. ఐతే అవన్నీ మాటల వరకే పరిమితం అనుకోవాలి, ఎందుకంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం ఆయన చేసిన పందేరమే. చంద్రబాబుపై ప్రతి బడ్జెట్ కి ముందు ఎమ్మెల్యేలకు తాయిలాల్లా ల్యాప్ ట్యాప్ లు, పీసీలు పంచుతుంటారని ఆరోపణలున్నాయ్. అందుకు తగ్గట్లే లాస్టియర్ పంచిన ల్యాప్ ట్యాప్ లు సరిపోవని ఇప్పుడు ట్యాబ్ లు ప్రతి ఎమ్మెల్యేకు సరఫరా చేసారట. 

                        ఇలా మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలిపి 225 మందే ఉన్నా ప్రభుత్వం మాత్రం మరో 175 ఎగ్ స్ట్రా ఆర్డర్ ఇచ్చారు. అవి డెలివరీ కూడా ఐపోయాట. మరి నాలుగొందల ట్యాప్ లు ఎందుకు, అంతకుముందు ల్యాప్ ట్యాప్ లు పనికి రాకుండా పోయాయా? అవి వేరు ఇవి వేరు అని చెప్పొచ్చేట్లయితే. ఈ మధ్యనే ఎమ్మెల్యేల జీతాలు భారీగా ఉన్నాయని వార్తలొచ్చాయ్, అలాంటప్పుడు కనీసం ఓ పదిహేను వేలు పెట్టి ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు కొనుక్కోలేని దీనస్థితిలో ఉన్నారా..? ఈ పందేరం ఏదో ఇంకోరకంగా వేరే కార్యక్రమాలకు ఖర్చుపెట్టొచ్చు కదా మరి విపక్షాలు విమర్శలు చేస్తాయంటే ఊరికినే చేస్తాయా..?
Now Andhra Pradesh government is low budget. But for every budget sessions Chandrababu Naidu is giving Laptops and Tablets to MLAs and MLCs.