విజయ్ మాల్యా కి మాగుంటకి లింకా..?

12 Mar 2016


                           సిపిఐ నేత నారాయణ మాటలకు ఇప్పుడు వేల్యూ ఉందో లేదో తెలీదు కానీ, ఆయన మరో బాంబు పేల్చాడు. దేశాంతరం పోయిన విజయ్ మాల్యాకి, ఎప్పుడో మర్డరైన మాజీ ఎంపి మాగుంట సుబ్బిరామిరెడ్డికీ లింకులున్నాయట. విజయ్ మాల్యా అనుకునే మాగుంటను నక్సలైట్లు అప్పట్లో చంపారట. నెల్లూరులో ఇలా ప్రేలాపించారు నారాయణ అసలు ఇలా జరగడానికి కాంగ్రెస్సే కారణమంటూ వాపోయాడాయన.

                         ఐనా అప్పులు ఎప్పుడిచ్చారనేదానితో సంబంధం లేకుండా విజయ్ మాల్యాపై ఆరోపణలు, అతగాడి ఘనత గత రెండు మూడేళ్లుగా అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న బిజెపి వాళ్లు చేతగాక చూస్తుండి పోగా, కాంగ్రెస్ పై పడి వాపోవడం ఏంటో నారాయణకే తెలియాలి. దేశంలో దొంగడబ్బంతా బంగారం అవుతుందంటూ మరో కామెంట్ చేశాడు నారాయణ. ఇప్పుడీ మాటలతో ఇంకో సందేహం కలుగుతుంది, మాగుంట సోదరుడు శ్రీనివాసులురెడ్డి ఇప్పుడు టిడిపి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయనకి  ఇంకా డిస్టిలరీ బిజినెస్ ఉంది కాబట్టి విజయ్ మాల్యాతో లింకులేదో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్లు భావించాలా.
CPI leader Narayana Comments has no value, his latest comments are very foolish. Recently he commented on Vijaya Malya. He said Vijaya Malya has connections with Magunta Subirami Reddy.