బొండా కోర్టు ధిక్కారం

17 Mar 2016


 వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అంటే  ఎందుకో మరి టిడిపి నేత బొండా ఉమాకి  ఎక్కడో కాల్తుంది. ప్రతిసారీ వెటకారంగా కామెంట్స్ చేయడం, ఆంటీ, ఐరన్ లెగ్ అంటూ విమర్శించడం  ఆయనకి ఫ్యాషనైపోయింది. ఐతే ఈ ఊపులో ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్న సంగతి మర్చిపోయి ఇవాళ నోరు జారాడు. హైకోర్టు తీర్పును తీసుకుని అసెంబ్లీకి వస్తున్న రోజాని సభకి రానివ్వమని, సభ సంప్రదాయాలని మంటగలిపిందని ఆమెపై నోరు పారేసుకున్నాడు. అసెంబ్లీ ఫస్ట్ సెషన్లోనే "కొడాలి నానిని ఉద్దేశించి." రేయ్ ఏంట్రా..ఏంట్రా..నరికేస్తా" అంటూ రెచ్చిపోయిన బొండా ఉమా మహేశ్వర్రావ్ ఇలా సభ, సంప్రదాయం అంటూ మాట్లాడటం, పాత సామెతలన్నింటినీ గుర్తుకు తెస్తుందని అంటున్నారు. 

పైగా హైకోర్టు ఆమె సస్పెన్షన్ చెల్లదని చెప్పి ఆదేశాలు ఇస్తే, శాసనవ్యవస్థలో కోర్టుల జోక్యమేంటి అంటూ మీడియా పాయింట్ లో పనికిరాని లాజిక్ ఒకటి లాగాడు. కానీ ఇక్కడ  ఆయన కన్వీనెంట్ గా మర్చిపోయి తన అజ్ఞానాన్ని ప్రూవ్ చేసుకున్నాడంటారు. ఎవరైనా అతగాడి వ్యాఖ్యలు కోర్టు దృష్టికి తీసికెళ్తే కంటెప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుందనే సంగతి కూడా తెలీకుండా పెట్రేగి పోవడం తగునా? ఎందుకంటే దీనిపై కోర్టుకు తమ వాదన విన్పిస్తామని చెప్పాడు. ఇలా చెప్పడంలోనే కోర్టే తమపై ఆదేశాలు ఇచ్చే అధికారం కలిగి ఉందని చెప్పాడు. మరిక కోర్టులు చెల్లవని చెప్పడం ఏంటో మరి లేడీ మార్షల్స్ ని బయట నిలబెట్టామంటూ కొన్ని ఛానళ్లకు లీకులు  ఇవ్వడంవంటి పనులు చేసిన టిడిపి నేతలు ఇప్పుడు రేపు అసెంబ్లీలో రోజా వస్తే ఎలా స్పందించాలో తెలీక మింగా లేక కక్కాలేక సతమతమవుతున్నారు.
AP high court gave judgement favor to Roja. Suspension on Roja was removed, Roja told i will attend to Assembly tomorrow. Bonda Uma comment on Roja.