రావెల..వెల వెల..

6 Mar 2016                         ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. కొడుకు నిర్వాకంతో తలెత్తుకోలేని స్థితి అసలు పార్టీలతో సంబంధం లేకుండా మంత్రుల పుత్రరత్నాల దర్జాకి దౌర్జన్యానికి ఇదో నిదర్శనమనే చెప్పాలి. ఖరీదైన కార్లు, రోడ్డు పై జోరుగా ప్రమాదాలు చేయడంలో బొండా ఉమా తనయులు, మంత్రి గంటా కొడుకు ఇప్పటికే పలు చోట్లు కేసులు బుక్కై తర్వాత రద్దు చేయించుకున్న ఘనులు. తాజాగా రావెల కొడుకు కూడా తన ఘనతను కక్కుర్తిని బైటపెట్టడంతో మంత్రి మొహం వెలవెల బోయింది. నిన్నటిదాకా వైఎస్సార్సీపీ పై ఒంటికాలితో లేచి తెగ సుద్దులు చెప్పిన మంత్రి ఇక కనబడటమే కరువైంది.

                           సాయంత్రం ఆరుగంటలలోపు విచారణకు హాజరు కావాలన్న బంజారాహిల్స్ పోలీసుల నోటీసుకు స్పందన కరవైంది. ఫాతిమా అనే యువతిని ఫార్చూనర్ కారులో వెంటాడిన విజువల్స్ అన్ని ఛానల్స్ ప్రసారం చేయడంతో రావెల నోట మాట కరువైంది. పైగా ఫేస్ బుక్ లో కుక్కపిల్ల అడ్డు రావడం వల్లనే కారు ఆపానంటూ కబుర్లు చెప్పిన సుశీల్ మాట వినడానికి నమ్మడానికి ఎవరూ సిధ్దంగా లేకపోవడం పెద్ద షాక్. అసలీ కేసు బైటపడిన వైనం కూడా విచిత్రమే, సాయంత్రం సాక్షిలో చిన్న బ్రేకింగ్ కన్పించింది. కాసేపట్లోనే ఏబీఎన్ లో బిగ్ బ్రేకైంది అన్నీ ఛానళ్లూ అందుకున్నాయ్, సాక్షి మాత్రం చివరిగా అందుకుంది. 

                            బహుశా రాజకీయకక్ష సాధిస్తున్నారని అంటారనేమో. ఐతే ఆ తర్వాత ముందు కేసును కప్పి పుచ్చే యత్నం. మీడియా హడావుడితోనే అంతా బైటకి వచ్చిన సిచ్యుయేషన్. దానికి పోలీసులు కవరింగ్ ఏమని ఇచ్చారంటే బాధితురాలు నిందితుడి పేరు చెప్పలేదనడం. ఐతే పేరు చెప్పడానికి అతనేమైనా మెడలో బోర్డేసుకుని తిరుగుతాడా, చివరికి  ఎలాగో సుశీల్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడం. విషయం అంతా గడగడమని బైటికి వచ్చి కంపు కంపు అయింది. ఇప్పుడు చెప్పు రావెలా నీ సుద్దులు ముందు నీ కుటుంబానికి చెప్పి ఆ పై జనానికి చెప్పు. పైగా మీవాడు గెలికింది ముస్లిం మహిళను ఉందా నీ దగ్గర సమాధానం.
AP cabinet ministers and their sons are miss using their their powers. Recently Ravela Kishore song teased a muslim girl.