ఏప్రిల్ లో బ్రహ్మోత్సవం

10 Mar 2016                           శ్రీమంతుడిగా దూకుడు మీదున్న మహేష్ బ్రహ్మోత్సవాన్ని ఈ సమ్మర్ లోనే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సంవత్సరంలోపే రెండో సినిమా రిలీజ్ చేసి మూడోది కూడా విడుదల చేయాలనేది ప్రిన్స్ ప్లాన్ గా తెలుస్తోంది. అలాగైతేనే తర్వాత సినిమాలు ఫాస్ట్ గా చేయగలమని క్లారిటీకి వచ్చినట్లు చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో షెడ్యూల్స్ అన్నీ పూర్తిచేసుకున్న బ్రహ్మోత్సవం టాకీ పార్ట్ 80శాతం కంప్లీటైందిట, మిగిలిన కాస్త భాగం ఇప్పుడు జరిగే కాశీ షెడ్యూల్ తో క్లైమాక్స్ కి  చేరుతుందంటున్నారు. వారణాసి బ్యాక్ గ్రౌండ్లో వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్లే ఆ సెంటిమెంట్ పరంగా కూడా బ్రహ్మోత్సవం సక్సెస్ ఖాయమని జనం ఫీలవుతున్నారు.                       పదిరోజుల పాటు జరిగే కాశీ షెడ్యూల్ తో గుమ్మడికాయ కొట్టడం. ఏప్రిల్ 9 లేదంటే 29కి సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. బిజినెస్ మేన్ తర్వాత మహేష్ బాబు ఫాస్ట్ గా పూర్తి చేసిన సినిమా ఇదే కావచ్చని  టాక్.
Mahesh Babu fans are waiting for Bhramostavam. Director Srikanth Addala fixed its release date. It will release in April.