తిక్క కుదిరింది

9 Mar 2016


                        "ఎవడేమనుకుంటే నాకేంటి" "నేనే పెద్ద రౌడీని, నాకంటే మగాడు ఎవడూ లేడు", అసలు ఏం చేసినా నేనే చేయాలి" ఈ డైలాగులు చాలనుకుంటా  ఎవరి గురించి చెప్తున్నామో తెలియడానికి, ఇష్టం వచ్చినట్లు ప్రేలాపన చేయడంలో నంబర్ వన్ హీరో ఆయన పాలిటిక్స్ లోకి డైరక్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఎక్కడా విగ్ లేకుండా బయటకు రావడం లేదు బాలకృష్ణ, డైలాగులు కూడా సినిమాలవే వాడుతున్నాడాయన. చెప్పేవాళ్లు లేరు, చెప్పినా వినే రకం కాదు పైగా చెప్పినవాళ్లకే నాలుగు షంటింగులు ఇవ్వగల అధికారం చేతిలో ఉంది. ఐతే సావిత్రి ఆడియో ఫంక్షన్ లో హీరోగారి డైలాగులు తనకే భారీ పంచ్ పడేలా ఉండటంతో వెంటనే అలర్టయ్యాడు, అయ్యో నేనలా అనలేదు. నాకు మహిళలంటే చాలా గౌరవం ఉంది, నన్ను క్షమించండంటూ వేడుకున్నాడు బాలయ్య.

                               ఇంతకీ ఏం జరిగిందంటే తన బావ తమ్ముడి కొడుకు నారా రోహిత్ సావిత్రి ఆడియో ఫంక్షన్ లో చీఫ్ గెస్ట్ బాలయ్యబాబే..! ఏదో యూత్ వచ్చారు కదాని వాళ్లని జోష్ తెప్పించడానికో, అసలు మాటలో కానీ అమ్మాయిలకు కడుపైనా చేయాలి..ముద్దైనా పెట్టాలి..కమిటైపోవాలంతే అంటూ అర్ధం పర్ధం లేని డైలాగులేశాడు. అందులో ఏం విన్పించిందో, అర్ధం అయిందో కానీ అక్కడి మోటు ఫ్యాన్స్ కూడా కేకలేశారు. దీన్ని ఫేస్ బుక్ లోనూ బైటా విమర్శించారు కొందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా కూడా బాలయ్య సహజంగా అలా అని ఉండరు. నోరు జారి ఉంటే క్షమాపణ కోరాలి అని డిమాండ్ చేసింది. వెంటనే విషయం ఎంత దూరం వెళ్తుందో అర్ధమైందో ఏమో బాలయ్య అయ్యా బాబూ ఈ ఎపిసోడ్ కి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి, ఐయాయ్  సారీ అన్నారు. దీంతో మనోడికి  అర్ధమై ఉండాలి ఇన్నాళ్లూ ఎలా మాట్లాడినా కుదిరిందేమో కానీ ఇకపై పబ్లిక్ లో ఎలా బడితే అలా మాట్లాడితే ఊరుకోవడానికేం ఇది లెజెండ్..లయన్..లాంటి ఏకపక్షచలనచిత్రాలు కాదు అని. ఐనా సినిమావాళ్లకు జనం అంటే చిన్నచూపు వల్గర్ గా మాట్లాడితేనే చప్పట్లు కొడతారని ఎంజాయ్ చేస్తారని. వాళ్లు సినిమాలో ఏదో చూసి  ఎంజాయ్ చేస్తే వీళ్లకి ఇంకోలా అర్ధమవుద్ది. అంతేకానీ మీ పిచ్చని భరించడానికి సిధ్దంగా లేరని ఈ యవ్వారంలో బాలయ్యకి, ఆయనగారి ఫ్యాన్స్ కి అర్ధం అయి ఉంటుంది.
TDP MLA Balakrishna talking movie dialogues on stages. Recently on Savitri movie audio function Balakrishna dialogue created sensation.