చరిత్రపై ప్రేమ

10 Mar 2016


                             తెలుగు హీరోల్లో బాలకృష్ణకు చరిత్ర, సంస్క్రతి వంటి అంశాలపై ఉన్నంత పిచ్చ ఇకే ఏ విషయంపైనా లేదంటే ఆశ్చర్యం కాదు. ఇప్పుడు దాన్ని తన వందో సినిమాలో  ఇమిడ్చేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఆదిత్య 999 మూవీ కూడా ఆ బేస్ తోనే వస్తుందన్నారు. ఇప్పుడు మరో ట్విస్ట్ ఏంటంటే, అది కాదు నా వందోది ఇదీ అంటూ మరో సబ్జెక్ట్ గురించి చెప్తున్నారు. అసెంబ్లీ లాబీల్లో ఈ సంగతి బాలయ్యే చెప్పాడట గౌతమీపుత్రశాతకర్ణి అనే రాజు అమరావతి ప్రాంతంలో గొప్ప రాజుగా పేరుపొందాడు. శాలివాహనశకానికి ఈయనకీ కూడా కొద్దిగా లింక్ ఉందంటారు. మెయిన్ గా గౌతమీపుత్రశాతకర్ణి మాతృస్వామ్య వ్యవస్థ ఎక్కువగా ఉన్న రోజుల్లో పాలించిన రాజు. తల్లి పేరుమీదుగా విలసిల్లిన వంశం శాతకర్ణి, ఇప్పుడా రాజు పాలన గొప్పదనం థీమ్ గా దర్శకుడు క్రిష్ ఓ సినిమా తయారు చేసాడట. అది బాలయ్యకి విన్పించడంతో ఆహా, ఆద్భుతం అంటూ అదే తీద్దాం ఫస్ట్ అన్నాట్ట.

                          ఐతే బాలయ్యకి ఇలాంటి కథాంశాలపై ఎంత మక్కువ ఉన్నా, ప్రతాపరుద్రుని ఇన్స్పిరేషన్ తో తీయాలనుకున్న కథ. నర్తనశాల కథ రెండూ ఆగిపోయిన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకురాకమానదు. ఐతే ఇది బాహుబలి సీజన్ కావడంతో బంపర్ హిట్టవ్వచ్చని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
Bala Krishna fans are waiting for his hundred movie. So Bala krisha is also busy in preparing story. So many talks about Bala Krishna 100 movie story.