అలాగే..మరి..చూసుకుంటే..!

7 Mar 2016                          సినిమా ఫంక్షన్లలో పెద్దగా కన్పించని వాళ్ల లిస్టులో మహేష్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణల పేర్లు ఉంటాయ్. అందులో బాలకృష్ణ ని ఉత్సవాలకు పిలవడం అంటే కొరివితో తల గోక్కున్నట్లే అని ఎవరూ ఆయన జోలికి పోరంటారు. ఐతే ఈమధ్య కాలంలో ఏ చిన్న సినిమా ఫంక్షన్ కైనా బాలయ్యే ఎక్కువగా కన్పిస్తున్నాడు. ఆయనతో యాక్సెస్ అంత ఈజీగా ఎలా దొరుకుతుందో కానీ రావడం, వచ్చి రాగానే డయాస్ పైన వాళ్లపై జోకులు వేస్తూ స్పీచులు ఇవ్వడం చూస్తుంటే అసలు బాలయ్యేనా అనుకుంటున్నారిప్పుడు సినీ జనం
గుంటూరు టాకీస్ ఫంక్షన్ కి వెళ్లి సందడి చేసిన బాలయ్య. ఇప్పుడు తాజాగా సావిత్రి ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా అలరించాడు. "ఐతే...అలాగే..మరి చూచుకుంటే.." లాంటి పదాలను అర్ధం పర్ధం లేకుండా, వాక్యాల మధ్య ఇరికించడంలో నంబర్ వన్ స్థానం ఎవరికైనా దక్కుతుందనుకుంటే అది బాలయ్యకే సాధ్యమంటారు.
     
                   అది నిజమనేలానే ప్రసంగం సాగింది రాజేష్ ని చూస్తే గుర్తుపట్టలేకపోయాను, మీసం పెంచాడు. సరే ఇక మా నందమూరి వంశం తారకరత్న ని చూచుకుంటే ఆయన మా వంశ గౌరవాన్ని నిలబెడతాడు. మనిషన్న వాడు నాలుగు రకాల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాలి, ఇలా సాగిన బాలకృష్ణ స్పీచ్ కొంతమందికి నవ్వు తెప్పిస్తే ఆయన ఫ్యాన్స్ కి మాత్రం పండగనే చెప్పాలి. నారా రోహిత్ హీరో అయితే తారకరత్న ఇందులో విలన్ అట కనీసం ఈ సినిమా అయినా ఓ యాభై రోజులు   ఆడితే రోహిత్ ఓ నటుడని మిగిలిన నిర్మాతలు గుర్తిస్తారు. లేదంటే తారకరత్న బాటలోనే నడవాల్సి ఉంటుంది.
Tollywood some of the heroes are not attend to movie functions. Like Bala Krishna, Jr NTR, Prabash. But recently Bala Krishna is attending to all movie functions and playing jokes on stages.