తెలుగోడి సత్తా

28 Mar 2016


బాహుబలి సినిమాకి జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ఈ ఏడాదికి కేంద్రం ఎంపిక చేయడంతో బాహుబలి టీమ్ ఆనందంలో మునిగిపోయింది. దాంతో పాటే వరుణ్ తేజ్ కంచె సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికవ్వడం ఈ సంబరాన్ని రెట్టింపు చేసినట్లే బావిస్తున్నారు. ఐతే బాహుబలికి అదొక్క కేటగరీలోనే కాకుండా ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో కూడా అవార్డులు వస్తాయని ఆశించారు.

కంచె సినిమా చూస్తే అవార్డులు వస్తాయని ముందునుంచీ ఎక్స్ పెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇది మెగా ఫ్యామిలీకి ఖచ్చితంగా ఆనందం కలిగించేదే, ఎందుకంటే ఇప్పటిదాకా మెగా ఫ్యామిలీ వారసుల్లో ఎవరూ జాతీయస్థాయిలో ఇలాంటి అవార్డు దక్కించుకోలేదు. కేంద్రం అవార్డులు వేరు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు వేరు. కుల వివక్ష, రెండో ప్రపంచయుధ్ద సమయంలోని సైనికుడిగా వరుణ్ తేజ్ నటన ముఖ్యంగా చివరి సీన్ లో అందరినీ కదిలించింది. అలాంటి సినిమాకే అందులో వరుణ్ తేజ్ రెండో సినిమాకు జాతీయస్థాయి పురస్కారం దక్కడం అతనికి ఓ బూస్టప్ ఇచ్చేదే.

బాహుబలి వరకూ చూసుకుంటే ఈ పురస్కారం ఓ ప్లస్ పాయింటే తప్ప, ఇప్పటికే ఈ సినిమాకి దక్కాల్సినంత గౌరవం, రెప్యుటేషన్ దక్కాయి. ఎలాగైతేనేం బాహుబలి కంచెలు తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని ఎక్కడకో తీసుకెళ్లాయని ఈ పురస్కారాలు నిరూపించాయ్.
Telugu movie Baahubali already created sensation in Indian movie industry. Now it get National award. It is selected as best picture. And Varun Tej movie Kanche is also got Best picture award.