కైకలూరి సింతామణితో బన్నీ

27 Mar 2016


ఈ మధ్య కాలంలో పాటల ఫంక్షన్ లేకుండా ఏ ఆడియో రిలీజ్ అవడం లేదు. ఐతే అల్లు అర్జున్ సినిమా సరైనోడు మాత్రం ఆడియో వేడుక లేకుండానే డైరక్ట్ గా పాటలు రిలీజ్ అవబోతున్నాయ్. అటు సినిమా కూడా బోయపాటి లెజండ్ తర్వాత వస్తున్నది కావడంతో జనంలో బాగానే అంచనాలు ఉన్నాయ్. స్టైలిష్ స్టార్ అంటూ ఓ ఇమేజ్ లోనే ఇరుక్కోకుండా అర్జున్ వరసగా డిఫరెంట్ సినిమాలతో వస్తున్నాడు. ఇప్పుడు సరైనోడుతో మరో మాస్ సినిమా రానుండటం, అతని ఇమేజ్ కి దోహదం చేసేదే అని అంటున్నారు.

ఈ సినిమాలో అంజలితో బన్నీ కైకలూరి సింతామణి అఁటూ ఓ పాటేసుకున్నాడు. అదే ఆడియో లాగా విడుదల కూడా చేశారు. ప్రస్తుతానికి ఆ పాట మంచి ఊపుతో సాగుతోంది. ఇది ముంత మషాలాలా మాస్ ని ఊపేస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత మాస్ ముద్ర వేయించుకోవడానికే అర్జున్ ఇలా బోయపాటితో సినిమా చేశాడన్నది నిజం. ఇంకో నాలుగురోజుల్లో ఫుల్ సాంగ్స్ ఆన్ లైన్లో రిలీజ్ చేయబోతున్నారు సినిమా యూనిట్.
Now Allu Arjun is doing with Boyapati Srinu in Sarainodu movie. In this movie he is doing mass role, and he did an item song with heroin Anjali.