ఫ్రీనే కానీ..మరీ ఫ్రీగా కాదు..

12 Mar 2016


                              ఏపీ ప్రభుత్వం వేలంపాటలో ఇసుక అమ్మకానికి పెట్టి ఆనక నాలిక్కరుచుకున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాం తీసుకోండహో అంటూ చాటింపేసింది. ఐతే ఇప్పుడు జిల్లాలకు తాజాగా ఓ సర్క్యులర్ పాస్ చేసింది, దాని సారాంశం ఏంటంటే ఉచితంగా ఇస్తున్నాం కదాని ఎలాబడితే అలా ఇసుక తోడుకుంటే ఊరుకునేది లేదు. వాల్టా చట్టాలకు అనుగుణంగా నిబంధనలకు లోబడి మాత్రమే ఇసుక తవ్వకాలు జరగాలి. లేదంటే ఇసుక రేటు కొండెక్కే అవకాశం ఉందని చెప్తోంది. ఇసుక ఇప్పుడు భవననిర్మాణరంగంలో ప్రధాన ముడి సరుకుగా మారింది. వర్షాలు కూడా ఇప్పట్లో పడవు, కాబట్టి నదీగర్భాలు కూడా ఎండిపోయే ప్రమాదం కన్పిస్తుంది. 
                
                                    ఉచితంగా ఇసుక తీసుకోవచ్చంటూ రీచ్ ల దగ్గరకి వెళ్లే జనం దగ్గర లోడింగ్ ఛార్జీల పేరుతో ఇప్పటికే డబ్బు పిండి వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయ్. ఐతే ఓ ఎద్దుల బండి, కానీ ట్రాక్టర్ కానీ, ఏ వాహనంలోకి ఇసుక ఎత్తాలన్నా కూలీ ఖర్చులు మామూలే. ఐతే అవి ఇసుకు కొనితీసుకుపోయే సమయంలోకంటే ఎక్కువ అవుతున్నప్పుడే జనం జేబులకు చిల్లు పడుతుంది. మూడు టన్నుల లారీకి వెయ్యి రూపాయలు, ఒక ట్రాక్టర్ కి ఎనిమిది వందలు వసూలు చేస్తున్నారు. మరి ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వ ప్రకటన ఈ యవ్వారాలతో అపహాస్యం పాలైనట్లే భావించాలి.
Recently AP government announced sand is free for home needs. But again AP government passed G.O, sand must be take under rules.