నేనూ వస్తా

19 Mar 2016


                 నటుడు మోహన్ బాబు కి రాజకీయ గుల మళ్లీ రేగింది. అందుకే తన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తొందర్లోనే మళ్లీ పాలిటిక్స్ లో కి వస్తానంటూ లెక్చరిచ్చాడు. ఐతే నిజంగా ఎవరు పాలిటిక్స్ లోకి వచ్చినా రాకపోయినా జనం వాళ్లకోసం ఎదురుచూడరు. ఐతే మోహన్ బాబు మాత్రం తప్పకుండా మళ్లీ వస్తానంటూ బెదిరిస్తున్నాడంటే ఖచ్చితంగా తన పాత పరిచయాలను వాడుకునే పనిలో పడ్డాడని అర్ధమవుతోంది. అన్న ఎన్టీఆర్ కి సన్నిహితంగా మెలిగి, ఆ తర్వాత లక్ష్మీపార్వతి దగ్గర సొమ్ములు కాజేశాడని ఈయనపై ఆరోపణలున్నాయ్. ఇది నిజమో కాదో కానీ చాలా ఇంటర్వ్యూల్లో స్వయంగా ఆమే ఈ సంగతి చెప్పి వాపోయింది కూడా. 

                   ఇప్పుడీ ఇంటర్వ్యూల్లోనే కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశాడు మోహన్ బాబు. కన్నప్ప అనే సినిమా తాను తీయబోతున్నట్లు చెప్పాడు. తన కొడుకు విష్ణుతో..! ఐతే ఇదే థీమ్ తో ప్రభాస్ ని హీరోగా పెట్టి ఆయన పెదనాన్న కృష్ణంరాజు సినిమా తీయాలని ఉంది ఇప్పటికే చాలాసార్లు అనేక ఇంటర్వ్యూల్లో బాకా ఊదేశాడు. మరిప్పుడు మోహన్ బాబు అదే టైటిల్ తో సహా ఎనౌన్స్ చేయడం కృష్ణంరాజుతో పోటీగానా అని అనుకుంటున్నారు అప్పుడే .
Today Mohan Babu birthday. On his birthday he gave interview to news channel, in this interview he announced shortly i will come to Politics. And he going to do Kannapa movie with his son Vishnu.