నిజాయితీ ఉంటే వేటేయ్..

7 Mar 2016                                తమ గుర్తుపై గెలిచి టిడిపిపంచన చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయమని ఏపీ స్పీకర్ కోడెలకు వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. చట్టప్రకారం వారిని అనర్హులుగా చేయాల్సిన బాధ్యత, ఆ పని స్పీకర్ స్థానానిదే కాబట్టి కోడెలను పార్టీ నేతలు కలిశారు. ఇప్పుడు ఈ బంతి స్పీకర్ కోర్టులోకి విజయవంతంగా చేరింది నిజాయితీ పద్దతుల గురించి లెక్చర్లచ్చే పెద్దలు ఇప్పుడెలా స్పందిస్తారనేదే ఆసక్తి గా మారింది. బడ్జెట్ సమావేశాల్లోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని వైసీపీ అధినేత డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణరెడ్డి, డేవిడ్ రాజు, జయరాములు, మణిగాంధీ, కలమట వెంకటరమణలు టిడిపిలో చేరినట్లు చెప్పుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ల సీట్లెటనే అంశం కూడా చర్చకు వస్తోంది.                                   18 రోజలపాటు కొనసాగే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది.  ఈ నెల 10న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2016-17  ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవ సాయ బడ్జెట్‌ను ఇదే సమావేశాల్లో ప్రవేశపెడతారు. మరి ఈ ఎనిమిదిమంది ఎమ్మెల్యేల సీట్లు ఎటనేది కూడా స్పీకర్ నిర్ణయిస్తారో, లేక వారంతటి వారే డిసైడ్ చేసుకుంటారో కానీ. అటూ ఇటూ కాని వైఖరే తేల్చుకుంటారేమో కూడా చూడాలి ఎందుకంటే దాదాపు సంవత్సరం తర్వాత తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి. టిడిపి నుంచి టిఆర్ఎస్ కు జంపైనవారికి నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడా బాటలోనే కోడెల కూడా నడుస్తాడో లేక సాగతీసుకుంటూ పోతాడో చూడాలి.
Recently some of YSRCP MLAs were joined in TDP. But AP Speaker is not taking any action against them. So lets see what will happen in budget session.