పబ్లిగ్గా..వాడేస్తే ఎలా?

17 Mar 2016


ప్రభుత్వం వివిధ పథకాలను ప్రకటించి వాటిలో జనం దగ్గర్నుంచి డిపాజిట్లు వసూలు చేస్తుంది. ఉదాహరణకు గోల్డ్ సావరిన్ బాండ్లు, ఇలా వచ్చిన సొమ్మును తమ కార్యకలాపాల కోసం వాడుకోవడం మామూలే ఐతే దానికి కూడా ఓ పరిమితి ఉంటుంది. ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు కానీ, ఇప్పుడు ప్రభుత్వాధినేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విదేశాల పర్యటనలు చేస్తూ, జనానికి మాత్రం పొదుపు గురించి బీద పలుకులు పలుకుతున్న తరుణంలో ప్రతి అంశం చర్చకు వస్తోంది. 

అలా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా తాము కానీ అంతకు ముందు ప్రభుత్వాలు కానీ వివిధ రకాల పథకాల రూపంలో ప్రజలనుంచి సేకరించిన డిపాజిట్లను ఇష్టారాజ్యంగా వాడేస్తుందని అంటున్నారు. ప్రతిపకనేత జగన్ ఇదే అంశంపై అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడటంతో ఈ విషయం బైటికి వచ్చింది. ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ 3 శాతానికి మించి  అప్పులు చేయకూడదని ఆయన చెప్పారు. ఐతే ప్రభుత్వం మాత్రం 8 శాతం వరకూ అప్పు చేస్తుందని ఆరోపించారు జగన్. ఈ వివరాలు ఏవీ బడ్జెట్ లో పొందుపరచలేదని ఓ వేళ బడ్జెట్ లో ఈ లెక్కలు  పెడితే తమ భాగోతం బయటపడుతుందనే అలా చేసిందని కూడా జగన్ ఆరోపించారు.

ఇదే నిజమైతే ఆర్దికనేరంగానే చూడాలి, ఓ వేళ ప్రతిపకనేతగా జగన్ దీన్ని రాజకీయకోణంలోనే లేవనెత్తినా, టిడిపి బ్రాండ్ గా పేరుబడ్డ ఓ పత్రికలో ఇదిప్రముఖంగా ఎందుకు వస్తుంది. లెక్కా పత్రం లేకుండా ఇలా ఖర్చుపెడితే దానికి జవాబుదారీ ఎవరు, ఓవేళ జగన్ ఆరోపణల్లో పసలేకపోతే ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఆ లెక్కలను బైటపెడితే ఆయనకి కవుంటర్ ఇచ్చినట్లు అవుతుంది. మరి చూద్దాం దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.
Andhra Pradesh CM Chandrababu Naidu and his minister spending more money for foreign tours and meeting. Andhra Pradesh is in low budget, so they are collecting money from peoples as bonds. It is over rule finance.