నిజంగా పంచుతారా..?

30 Mar 2016


మాటలు కోటలు దాటడం అంటే జనరల్ గా గుర్తొచ్చేది మన పొలిటీషియన్లే..!  ఎందుకంటే అరచేతిలో వైకుంఠం చూపించడంలో వాళ్లని మించినవాళ్లు లేరంటారు. వాళ్లు తలచుకుంటే కరీంనగర్లో థేమ్స్ నదిని సృష్టిస్తారు, అందులో బర్త్ డే పార్టీలు చేయిస్తామంటారు, ఊరూరూ ట్యాంక్ బండ్ లు కట్టిస్తామంటారు. అలానే నిర్మాణమే కానీ రాజధానిలో మెట్రో పరుగులు పెట్టిస్తామంటారు. ఇప్పుడలాంటి ప్రకటనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తోంది. వర్షాకాలంలో 81లక్షల మొక్కలు పంపిణీ చేస్తారట, ఇందుకోసం నర్సరీల్లో కార్యక్రమం ప్రారంభం కూడా అయినట్లు చెప్తున్నారు. ఇది నిజమే అయితే అది చాలా గొప్ప కార్యక్రమం, అందులో పాతికశాతం మొక్కలు బతికినా హైదరాబాద్ నగరం ఓ ఊటీగా, ఫార్మావనంగా మారుతుంది. అందులోనూ ఇప్పుడు పంచుతామని చెప్తున్న మొక్కల్లో జామ, దానిమ్మ,మామిడి లాంటి వ్యాపారవృక్షాలతో పాటు తులసి, అశ్వగంధ, ఉసిరి, సర్పగధ, మిరియాలు వంటి సుగంధ మొక్కలు కూడా పంచుతామని చెప్పడం కొంతమందిలో ఆశలు రేపుతోంది. ఈ మొక్కలు ఔషధవిలువలు కలిగి ఉండటంతో పాటు అంత  తేలికగా ఎక్కడా దొరకవు. అందుకే ఈ పంపిణీ కార్యక్రమం ఓ ఫార్సుగా మిగిలిపోకుండా లక్ష్యం చేరాలని ఆంధ్రాపల్స్ కూడా ఆశిస్తోంది. లేదంటే ఇంకుడుగుంతలు, ఇంటింటికీ నల్లా లాంటి ప్రచార ఆర్భాట కార్యక్రమాల్లా మిగిలిపోతుంది. 81లక్షల మొక్కల్లో 35 లక్షలు మాత్రమే జిహెచ్ఎంసీ దగ్గర ఉండగా, మిగిలినవి మాత్రం వేరేచోట్ల నుంచి తెప్పిస్తారట. చూడాలి ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో..!
GHMC is telling we will distribute 81 lacks of plants in this rain season to make Hyderabad as Green city. Lets see what will happen.