ఇదేనా ప్రత్యేక ప్రేమ

1 Mar 2016                                కేంద్ర బడ్జెట్ లో ఏపికి కేంద్రం విదిల్చింది రెండొందల కోట్లు, పోలవరానికి 100కోట్లు, విజయవాడ మెట్రోకి 100కోట్లు. పోలవరం అంచనా వ్యయమే 30వేల కోట్లకు చేరిందని వార్తలున్నాయ్. అసలీ వ్యయం ఎప్పుడో 2013లోనే  16 వేల కోట్ల రూపాయలకు చేరిన పోలవరం  ఇప్పుడు కేంద్రం కేటాయించిన వందకోట్లనిధులను ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలీక జుట్టు పీక్కోవాలి మరి. అనంతపురం జిల్లా టిడిపి మంత్రులు కూడా ఇవి సరిపోవంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అసలు పోలవరం అనేది కేంద్రం బాధ్యత అని దాన్ని నిర్మించడం కూడా తామే చూసుకుంటామంటూ మాజీ మంత్రి పురంధీశ్వరి కూడా ఇప్పటికే అనేకసార్లు చెప్పారు. దానికి తోడు చంద్రబాబు కూడా ఈ అంశంపై ఇదే ఒపీనియన్ చెప్తారు. మరి ఇప్పుడు పోలవరం 2019నాటికి ఎలా పూర్తవుతుందో ఈ గొప్పోళ్లకే తెలియాలి. అందుకే అంటున్నారు కన్ఫామ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరు, పోలవరం పూర్తి చేయరు అని. ఇప్పటికి పోలవరం ఏ దశకు చేరుకుందో చూసినోళ్లు లేరు. ఇక మిగిలి ఉంది రెండు బడ్జెట్లు లేదంటే మూడు బడ్జెట్లు ఈ మూడు బడ్జెట్లలో పోలవరానికి వెయ్యి కోట్లు చొప్పున మూడువేలకోట్లరూపాయలు కేటాయించినా పూర్తి చేయడం ఎలా సాధ్యమవుతుందో దేవుడికే తెలియాలి.                           7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా, కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటి మళ్లింపు, విశాఖపట్నంలో పారిశ్రామిక అవసరాలకు 23.74 టీఎంసీల సరఫరా, గోదావరి డెల్టా రెండో పంట స్థిరీకరణ, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో 2005లో పోలవరం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పుడు ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 10,206 కోట్లు. కుడి, ఎడమ కాలువ, హెడ్‌వర్క్స్ ఇలా అన్ని పనులను 22 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించింది. హెడ్‌వర్క్స్‌లో భాగమైన స్పిల్‌వే, రాక్‌ఫిల్‌డ్యాం పనులు దక్కించుకొన్న కాంట్రాక్టర్లను 2009లో తప్పించిన ప్రభుత్వం 2013లో రెండు పనులను ఒకే ప్యాకేజీగా కాంట్రాక్టర్ కి అప్పగించింది. . మరిప్పుడు పూర్తి చేయకుండా వదిలేసేందుకే ఇలా చేస్తున్నారా. అందుకే పట్టిసీమను ఎత్తుకున్నారా అన్పించకమానదు సమాధానం చెప్పకుండా గాలి విమర్శలు చేస్తున్నారనడం ఈజీనే మరి. కేంద్రం,రాష్ట్రం రెండూ వదిలేస్తే ఇన్నాళ్లూ ఖర్చు పెట్టిన సొమ్ము ఏం కావాలి.
In central budget 2016, 200 cr was released to Andhra Pradesh. One hundred crore for Polavaram and one hundred crore for Vijayawada metro trains. But leaders have to think how Polavaram will complete with this budget.