13 మిలియన్ స్టిల్ స్ట్రాంగ్ అండ్ సెక్సీ

7 Mar 2016


                           ఇప్పటి రోజుల్లో ప్రియాంకచోప్రా పేరు వినని సినిమా లవర్లు ఉండరు. రోజు రోజుకీ పెరిగిపోతున్న అభిమానం అంటే ఏంటో ఆమె ఫాలోయర్ల సంగతే చెప్తోంది. ఆరడుగులకు కాస్త తక్కువ పొడగరి ప్రియాంక ఎక్కడేది  ఉండాలో అక్కడ అదే సైజులో ఒంపుసొంపులతో బ్రహ్మ నీట్ గా చెక్కాడామో అన్పిస్తుంది ఈ బ్యూటీని చూస్తుంటే. ఇప్పుడు ప్రియాంకను ట్విట్టర్లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 13 మిలియన్లకు చేరింది. అంటే కోటి ముప్పైలక్షలమంది ఫ్యాన్స్ ప్రియాంక ఘాటు అందాల ఆస్వాదనలో మునిగితేలుతున్నారన్నమాట హాలీవుడ్ కి మకాం మార్చిన ప్రియాంక చోప్రా మియామీ బీచ్ లో ఈ విషయాన్ని చెప్తూ ఓ వీడియో షేర్ చేసింది. బేవాచ్ బికినీ సినిమాలో నటిస్తున్న ఈ హాట్ బేబ్ జై గంగాజల్ అని గంగాజల్ సిరీస్ లో ఫైనల్ మూవీలో నటించింది. పట్టిందల్లా బంగారంలా మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి తరించడానికా అన్నట్లు అమెరికన్లు ప్రతీ షోకి ఆమెని పిలిచి సంబరపడిపోతున్నారు. ఫాలన్ టూ నైట్ షోకి కూడా గెస్ట్ గా వెళ్లిన ప్రియాంక ఇక నెక్ట్స్ హాలీవుడ్ మూవీల్లోనే నటిస్తుందేమో అని ఇక్కడి ఫ్యాన్స్ దిగులుపడుతున్నారు పాపం.
Bollywood hot heroin Priyanka Chopra entered into Hollywood and doing TV serials. So from then onward her fans followers reached 13 millions.