లోకేశ్ ఎక్కడ..ట్విట్టర్ పిట్ట మూగబోయిందేం

5 Feb 2016


               చంద్రబాబు వారసుడిగా ఇక ఇరగదీస్తాడని భజనపరులంతా చినబాబును ముందుకు తోసేశారు. ఆయనా నా అంతటి వాడు లేడనుకున్నాడు, నలభై రోడ్ షోలు చేస్తూ జనంపై కళ్లెర్రజేశాడు, ఇంత చేసినా సింగిల్ డిజిట్ కార్పొరేటర్లే పార్టీకి దిక్కయ్యారు. తీరా వాళ్లంతా మళ్లీ జంప్ కొట్టరనీ లేదు, ఇదేదో టీడిపి అంటే గిట్టదని రాయడం కాదు. వాస్తవాలు చూడండి నేను లోకల్.. నువ్వ్ నాన్ లోకల్.. మా తాత, మా నాన్నే సిటీని డెవలప్ చేశారు. మీరేం చేశారంటూ లోకేష్ చేసిన ప్రచారం చూశారు. మరి నిజంగా అంత అభివృధ్దే చేస్తే జనం  ఎందుకు ఇంత దారుణంగా ఓడించిపారేశారు. 

                 80కి పైనే వార్డుల్లో పోటీ చేసిన టిడిపి కనీసం 10 డివిజన్లు గెలవకపోవడం ఎలా అర్ధం చేసుకోవాలో పాఠకులే చెప్పాలి. ఇప్పటిదాకా వైఎస్సార్సీపీ, టిఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన టిడిపి నేతలు వారి పార్టీ అడ్రస్ ఎక్కడుందో చెప్పగలరా. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి, చేసిన విమర్శలే చేసుకుంటూ అడ్డంగా జనం మీదకు పోతే ఏమవుతుందో. లోకేశ్ కు ఇప్పటికైనా అర్ధం కావాలి. లోకేశ్ బాబూ ట్విట్టర్లో విమర్శలు చేసినంత ఈజీ కాదు రాజకీయం అంటే సొంతంగా ఓ పార్టీ పెట్టుకుని 63మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్ స్థాయి కంటే మీ స్థాయే ఎక్కువని అంటుంటారే. మరి దీన్ని ఎలా అర్ధం చేసుకుంటారు. ఓ మంత్రి అయినా ప్రతి గల్లీలో తిరిగి ప్రచారం చేసి తన సత్తా చూపించుకున్న కేటీఆర్ స్థాయేంటో ఇప్పటికైనా అర్ధంఅయి ఉండాలని టిఆర్ఎస్ వాదులు అంటున్నారు. వారసులుగా ఎంటర్ అవ్వడం తప్పేం కాదు, కానీ ఎదుటివారిని చీప్ గా మాట్లాడటం మన అవివేకాన్నే సూచిస్తుంది.
Today GHMC elections results were released. In GHMC campaign Nara Lokesh took main role in TDP, participated in 42 road show. But didnt get at least double digit.