పవన్ కల్యాణ్ హీరోయిన్ కి ఏమైంది?

28 Feb 2016                      నికిషా పటేల్ గుర్తుందా పవన్ కల్యాణ్ అట్టర్ ఫ్లాప్ మూవీ పులి/కొమరం పులిలో హీరోయిన్ గా చేసింది. ఆ చిరుతపులి కళ్ల చిన్నదే నికిషా పటేల్ మూవీ ఫలితం ఎలా ఉన్నా కర్వీ కట్స్ లవ్లీ లిప్స్, సెక్సీ హిప్స్ తో యూత్ ని బాగానే ఆకట్టుకుంది నికిషా పటేల్. అందుకే ఆ తర్వాత కల్యాణ్ రామ్ సినిమా ఓమ్ త్రీడీ అనే  సినిమాలోనూ బుక్కైంది. అది కూడా భారీ బండనే పడేసింది. తెలుగులో పెద్దగా పెర్ఫామ్ చేయకపోయినా, ఈ బ్యూటీకి ఆఫర్లకేం కొదవలేదు, మొత్తం ఆరేళ్లలో 12 సినిమాలు చేసింది. ఇప్పుడు అరకు రోడ్ లో అనే సినిమాలో చేస్తున్న నికిషా పర్సనాలిటీ చూస్తే పులి లో కన్పించిన ఆ హీరోయిన్ ఈమెనా అన్పించకతప్పదు. బాగా లావైపోయి నమితకు తక్కువ హన్సికకు ఎక్కువలా సైజులన్నీ పెంచేసింది, అసలు ఒకప్పుడు తనూరాయ్ అనే హీరోయిన్ కూడా వరసహిట్లలో నటించి కూడా బాడీ సెన్స్ లేక చివరికి వ్యాంప్ కేరక్టర్లు చేసుకోవాల్సి వచ్చింది. నికిషా పటేల్ బాడీ కూడా  అంతే బాగా పెరిగిపోయింది. ఒకప్పటి నాజూకుతనం లేకపోగా కళ్లలో రొమాన్స్ బదులు నీరసమే కన్పిస్తుంది.

             పైగా ఈసినిమాలో హీరో సాయిరామ్ శంకర్, పూరీ జగన్నాధ్ తమ్ముడే ఇతగాడు. పేరు కలిసిరాలేదనుకున్నాడేమో, రామ్ శంకర్ పేరుతో ఈ సినిమాతో రాబోతున్నాడు. ఈ పెయిర్ చూస్తే దొందూ దొందే అనుకోకతప్పదు. పవన్ కల్యాణ్ సరసన నటించిన హీరోయిన్లకు లైఫ్ ఉండదని మామూలుగానే జోకులు పేలుతుంటాయ్. దానికి ఇప్పటి నికిషా పటేల్ స్థితి కూడా సాక్ష్యంగా చెప్పుకోవాలేమో.
Power Star Pavan Kalyan movie Komaram Pulli got big flap. This movie heroin Nikisha Patel later got six movies, now she doing with Ram Shankar. In this movie she looks very fatty.