బూతు దర్శకుడి డైరక్షన్ లో చిరుత

5 Feb 2016


               టైమ్ బాలేకపోతే తాడే పామవుతోందట అలానే రామ్ చరణ్ కు ఇప్పుడు సరైన హిట్ లేకపోవడంతో ఎక్కడ ఏ హిట్ సినిమా కన్పించినా రీమేక్ చేద్దామా అనే ఊపులో ఉన్నాట్ట. అలాంటి ఆవేశంతోనే బ్రూస్ లీ వచ్చేసింది, పోయింది. బ్రూస్ లీ రీమేక్ మూవీ కాదు కానీ, దూకుడు మేనియాలో ఒప్పుకున్న సినిమా అది. ఐతే ఇప్పుడు తాజాగా తనకి తనీ ఒరువన్ అనే రీమేక్ పై కన్నుపడింది. ఆ తర్వాత శ్రీమంతుడు డైరక్టర్ కొరటాల శివ, నాన్నకు ప్రేమతో దర్శకుడు సుకుమార్ ని లైన్లో పెట్టుకుని సినిమాలు తీసేందుకు రెడీ అయ్యాడు. ఐతే సుకుమార్ సినిమా దాదాపు ఉండకపోవచ్చు.

                  ఇప్పుడు లేటెస్ట్ గా మారుతి అనే దర్శకుడిని కూడా తన లుక్స్ లో ఉంచాట్ట. సొసైటీలో జరిగేవే ఇవి అంటూ బూతు డైలాగులతో సినిమాలు నింపేసిన చరిత్ర మారుతిది. కావాలంటే అతగాడి సినిమాలు చూసి అందులో డైలాగ్స్ ఇంట్లో వాడతారేమో చెప్పండి. ఏజైపోయిన వెంకటేష్ మారుతితో సినిమా అనౌన్స్ చేయగానే రామ్ చరణ్ కూడా మనోడితో సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డాట్ట. బన్నీతో మారుతికి మంచి రిలేషన్ ఉంది. భలేభలే మగాడివోయ్ సినిమా సక్సెస్ తర్వాత క్లీన్ సినిమాలు తీయగలడనే చెర్రీ కూడా మారుతిపై ఒపీనియన్ పెట్టుకున్నాడట. చూద్దాం ఇది ఏమాత్రం సెట్స్ వరకూ వస్తుందో ఎందుకంటే చిరుత తండ్రి చిరు కూడా గతంలో ఇలానే హిట్టిచ్చిన ప్రతీ డైరక్టర్ తో సినిమాలు ఎనౌన్స్ చేయడం ఆ తర్వాత వెనక్కి తగ్గడం కామన్ గా జరిగేది ఇప్పుడదే రిపీటవుద్దో లేదో మరి.
Present Ram Charan time is very bad. His latest movie got failure, he want to do with success directors. Now he is planing to do a movie with Maruthi.