ఇక ఇప్పుడు విలన్ గా

18 Feb 2016


               ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో తన హవా నడిపించేస్తోంది. అన్ని అవార్డులు దక్కించుకోవడంతో పాటు సెక్సీయెస్ట్ ఉమెన్ గా టైటిల్ దక్కించుకున్న ఈ పొడుగు కాళ్ల సుందరి క్వాంటికో అనే హాలీవుడ్ సీరియల్లో కూడా నటిస్తోంది. లిప్ కిస్సులతో పాటు రొమాన్స్ సీన్లలో రెచ్చిపోతూ కన్పిస్తున్న ప్రియాంక ఈ ఏడాది ఆస్కార్ ప్రెజంటేటర్ గా కూడా కన్పించబోతోంది. ఇప్పుడు తాజాగా బేవాచ్ అనే మెగా మారథాన్ సీరియల్లో విలన్ గా చేస్తుందట ప్రియాంక, పర్పెక్ట్ బికినీ భామగా పేరుతెచ్చుకున్న ప్రియాంకకి ఇది సరైన పాత్రే అవుతుంది. 

              బేవాచ్ అనేది కనీసం పాతికేళ్లుగా స్టార్ లో ప్రసారమవుతున్న సీరియల్. బీచ్ లో బికినీ భామలు, వారి అడ్వంచర్స్ తో ఉర్రూతలూగించే షో అది. అలాంటి కథాంశంతోనే బేవాచ్ అనే మూవీ కూడా తెరకెక్కబోతోంది. అందులోనే ఇప్పుడు ప్రియాంకకు ఛాన్సొచ్చింది. ఈ విషయాన్ని నటుడు జాక్ ఎఫ్రాన్ కన్ఫామ్ చేశాడు ఆయనే ఇందులో ప్రియాంక సరసన నటించబోతున్నాడు. సేథ్‌ గోర్డాన్ డైరెక్ట్‌ చేసే ‘బేవాచ్’లో జాక్‌ ఎఫ్రాన్, కెల్లీ రోర్‌బాచ్ మరో రెండు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2017 మేలో ఈ సినిమా విడుదలవుతుంది.ప్రియంకా చోప్రా ఇదివరకు ఐత్‌రాజ్‌’ నెగటివ్ క్యారెక్టర్ చేసింది. ఇప్పుడు హాలీవుడ్ లో అదే ఫీట్ రిపీట్ చేయబోతోంది.
Bollywood heroin Priyanka Chopra is now doing in Hollywood. And she got $exyest women award. Now she is doing as villain in Bevaach serial.