పూరీ పెద్ద మానిప్యులేటరా..

5 Feb 2016


          ఒకప్పుడు హిట్లు, ఇప్పుడు ఫ్లాప్ కి కేరాఫ్ అడ్రస్ ఇదీ పూరీ జగన్నాధ్ ప్రజెంట్ స్టేటస్ బూతుపదాలను సినిమా టైటిళ్లుగా పెట్టే పూరి ఇప్పుడు ఉన్నట్లుండి నందమూరి ఫ్యామిలీకి ఫేవరిట్ గా మారిపోయాడు. నిన్న గాక మొన్న కల్యాణ్ రామ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న పూరీ ఇప్పుడు జూనియర్ తో మరో స్టోరీ ఓకే చేయించాడట. ఈమధ్యే తన స్టాఫ్ పాతికమందిని ఊస్టింగ్ చేసేసిన పూరీ ఇంత త్వరగా రెండు సినిమాలు ఎలా ఓకే చేయించాడో అర్ధం కాక సినీ జనం జుట్టుపీక్కుంటున్నారు. ఈ అపూర్వసోదరులను ఆన్ ది స్పాట్ లో ఓ రెండు మూడు గంటల గ్యాప్ లో స్టోరీలు చెప్పాడట. 

          జూనియరేమో భయ్యా సూపర్ అంటే, పటాసేమో ఆహా ఇదీ కథంటే అంటూ కౌగలించుకున్నాట్ట. ఐతే ఇదంతా బయట టాక్. నిజం ఏంటో అంత గొప్ప కథలేంటో రేపు తెరపై చూస్తే కానీ తేలదు. ఎందుకంటే దేవుడు చేసిన మనుషులు అనే సినిమా చూస్తే పూరీ పైత్యం ఓ స్థాయిలో ఉంటుందో అర్ధం అవుద్ది. అయినా మైనస్సూ, మైనస్సూ ప్లస్ అనుకుంటే ఇప్పుడు డబుల్ ప్లస్సవుద్దా.
Puri Jaganth is present care of address for flaps, and he is popular for dirty movie names. Now Puri became favorite to NTR family. Now he is doing a movie with Kalyan Ram and a story was fixed to Jr NTR. Lets see what will happen to these movies.