శాండ్ ఫ్రీ అందుకేనా..

27 Feb 2016                ఏపీ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తామనే ప్రకటనకు తామే కారణమని వైఎస్సార్సీపీ అంటోంది. శాండ్ పాలసీ అంటూ తెగ హడావుడి చేసి దానికోసం కమిటీ వేసి ఆ తర్వాత డ్వాక్రా యూనిట్లకు అమ్మకాలు, ఆన్ లైన్ టెండర్లంటూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన స్టంట్లు అన్నీ ఇన్నీ కాదు. చివరికి దాన్ని అటకెక్కించేసి, ఇప్పుడు ఫ్రీ అనడం వెనుక అసలు కథేంటి.?

                  వైఎస్సార్సీపీ నేత బొత్స కథనం ప్రకారం చంద్రబాబు పాలన అంటే జనం మండిపడుతున్నారని. ఏదోక సంక్షేమపథకం ప్రకటిస్తే కానీ, ప్రస్తుతానికి ఆ అసంతృప్తి తగ్గదనే నిర్ధారణకు వచ్చారట. అందుకే నదుల వెంట ఎక్కడబడితే అక్కడ దొరికేదీ జనాలకు అవసరమైనది. తమ చేతికి మట్టి అంటనిదీ అయిన ఇసుకను ఉచితంగా అందిస్తామంటే సరిపోతుందని అనుకుని వెంటనే ఆ నిర్ణయం ప్రకటించేశారట. ఐతే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. 

                         ఇప్పటికే ఇసుకరీచ్ ల దగ్గర మాఫియా ఎంతలా వేళ్లూనుకుపోయిందో ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పై దాడి యవ్వారమే చెప్తోంది. తమ వారిపై కేసులు పెట్టకుండా బాగానే ప్రభుత్వం కవర్ చేసుకుంది ఆ వ్యవహారంలో అందుకే భవిష్యత్తులో కూడా తమనేతల దందా నడవాలంటే ఉచితంగా రవాణా చేస్తామంటే సరిపోతుందనే ప్లాన్ కన్పిస్తోందని  విమర్శలు వస్తున్నాయ్. ఎటూ నోరులేని జనం రేటు పెట్టి కొనడానికి అలవాటు పడ్డారు. జస్ట్ సరిహద్దులు దాటుతున్నప్పుడు అఫిషియల్స్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తే సరిపోతుందని టాక్.
AP government announced free sand, but YSRCP saying it is possible only with us. To satisfy people AP government introduced it.